Open AI కొత్త ఫీచర్: చాట్​జీపీటీలో ‘టాస్క్స్​’..

Open AI కొత్త ఫీచర్: చాట్​జీపీటీలో ‘టాస్క్స్​’..

ఓపెన్ ఏఐ కంపెనీ చాట్​జీపీటీ కొత్త ఫీచర్ పరిచయం చేసింది. దానిపేరు ‘టాస్క్స్’​. ఈ ఫీచర్​ ద్వారా యాక్షన్స్, రిమైండర్స్ వంటివి షెడ్యూల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆన్​లైన్​లో టికెట్స్ కొనొచ్చు. సేల్స్ జరిగేటప్పుడు గుర్తు చేసేలా ఆప్షన్​ సెట్ చేసుకోవచ్చు. అలాగే వారంలో వచ్చిన వార్తలను క్లుప్తంగా అందిస్తుంది. దాంతోపాటు రోజువారీ వాతావరణ మార్పుల గురించి అప్​డేట్స్ వంటివి కూడా తెలుసుకోవచ్చు.

ఇలా వాడాలి

ఈ ఫీచర్​ని ఉపయోగించేందుకు సబ్​స్క్రయిబర్లు అందుబాటులో ఉన్న మోడల్స్ నుంచి ‘40 విత్ షెడ్యూల్డ్​ టాస్క్స్’ ను సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత చాట్​జీపీటీలో చేయాల్సిన పనులు, టైంని టైప్​ని చేయాలి. దాంతో ఈ ఫీచర్​ మీ చాట్​ల ఆధారంగా సూచనలు అందిస్తుంది. అయితే, వీటిని యాక్సెప్ట్​ లేదా డిక్లైన్ చేసే అవకాశం కూడా ఉంది. అన్ని టాస్క్​లను నేరుగా చాట్​ థ్రెడ్​లలో లేదా ప్రొఫైల్ మెనూలోని టాస్క్స్ సెక్షన్ ద్వారా మేనేజ్ చేయొచ్చు. అంతేకాదు.. గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి, అమెజాన్ అలెక్సా వంటి వాటికి పోటీగా వర్చువల్​ అసిస్టెంట్​ తీసుకురావాలని ఆలోచిస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా యూజర్లకు అందుబాటులో ఉంది.