హైదరాబాద్, వెలుగు: రంజీ ట్రోఫీలో వరుసగా రెండు పరాజయాలతో డీలా పడ్డ హైదరాబాద్ మూడో మ్యాచ్ను సానుకూలంగా ప్రారంభించింది. గ్రూప్–బిలో భాగంగా పుదుచ్చేరి జట్టుతో శనివారం ఉప్పల్ స్టేడియంలో మొదలైన మ్యాచ్లో భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (152 బ్యాటింగ్) భారీ సెంచరీతో సత్తా చాటడంతో టాస్ నెగ్గి బ్యాటింగ్కు వచ్చిన హైదరాబాద్ 290/1 స్కోరుతో తొలి రోజు ముగించింది.
మరో ఓపెనర్ అభిరథ్ రెడ్డి (68)తో కలిసి తన్మయ్ మొదటి వికెట్కు 111 రన్స్ జోడించి మంచి పునాది వేశాడు. రోహిత్ రాయుడు (62 బ్యాటింగ్)తో రెండో వికెట్కు అజేయంగా 179 రన్స్ జోడించాడు. పుదుచ్చేరి బౌలర్లలో సాగర్ ఉదేశి ఓ వికెట్ పడగొట్టాడు.