
మ్యాచ్‌కు ముందు ఓపెనింగ్ సెర్మనీ కలర్‌ఫుల్‌గా సాగింది. బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ తన పెర్ఫామెన్స్‌తో ప్రేక్షకులతో పాటు క్రికెటర్లను సైతం ఫిదా చేశాడు. హీరోలు వరుణ్ ధావన్, టైగర్ ష్రాఫ్, సిద్దార్థ్ మల్హోత్రా, కార్తీక్ ఆర్యన్ కూడా తమ డ్యాన్స్‌తో అలరించారు. చివర్లో పలు డైలాగ్స్‌తో పాటు జవాన్, పఠాన్ సినిమా పాటలకు స్టెప్పులేసిన షారుక్ అనంతరం ఐదు జట్ల కెప్టెన్లను స్టేజ్‌పైకి పిలిచి పరిచయం చేశాడు. స్మృతి మంధాన కోరిక మేరకు రెండు చేతులు చాచి తన సిగ్నేచర్ పోజ్ ఇచ్చాడు. తర్వాత ఐదుగురు కెప్టెన్లు షారుక్‌తో కలిసి సిగ్నేచర్ పోజ్ ఇచ్చారు.