మనిషి ఎలా బ్రతకాలో గోల్ఫ్ నేర్పిస్తుంది: గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

 గోల్ఫ్ లో విజయం సాధించాలంటే మానసికంగా బలం అవసరమన్నారు తెలంగాణ గర్నర్ జిష్టు దేవ్ వర్మ. అప్పుడే గెలుపు సాధ్యమని చెప్పారు. శ్రీనిధి యూనివ్సిటీ తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ జెర్సీ లాంఛ్  కార్యక్రమానికి ముఖ్యఅథిగా హాజరయ్యారు  జిష్ణు దేవ్ వర్మ. ఈ సందర్భంగా టీపీజీఎల్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.  

గతంలో డంప్ యార్డ్ గా ఉన్న  ప్రాంతాన్ని అందమైన గోల్ఫ్ కోర్స్ గా చేసినందుకు అభినందించారు.  మన ప్రాంతంలో గోల్ఫ్ అభివృద్ధికి ఈ లీగ్ ఉపయోగపడుతుందన్నారు.  మనిషి ఎలా ప్రవర్తించాలో గోల్ఫ్ నేర్పిస్తుందన్నారు.  గత 15 ఏళ్లుగా గోల్ఫ్ స్టిక్ పట్టుకోలేదని..  మళ్ళీ ఇపుడు మొదలుపెడతానని చెప్పారు.  వారసత్వ సంపద, పర్యావరణ హితంగా ఉన్న ఈ గోల్ఫ్ క్లబ్  తనకు బాగా నచ్చిందన్నారు. బహుశా త్వరలో  తనను  గోల్ఫ్ క్లబ్ లో చూడొచ్చని చెప్పారు గవర్నర్ .