హైదరాబాద్, వెలుగు : స్వీట్ల తయారీలో ఉన్న బికనెర్వాలా హైదరాబాద్‌లోని రాజేందర్ నగర్, అరమ్‌ఘర్‌లో నూతన అవుట్‌లెట్‌ను ప్రారంభించింది. ఇది సిటీలో కంపెనీకి 7 వది కాగా దేశంలో 200వ అవుట్‌లెట్. ఈ సందర్భంగా బికనెర్వాలా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ చేతన్ అగర్వాల్ మాట్లాడుతూ..
ఇండియాతో పాటు విదేశాలలో కూడా నూతన అవుట్‌లెట్లను ఏర్పాటు చేయడానికి ప్లాన్స్ వేస్తున్నామని తెలిపారు. కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇండియా, యూకే , ఆస్ట్రేలియాతో పాటు యూరప్‌లలో 50 కి పైగా అవుట్‌లెట్‌లను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు.