- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం నగరంలోని వైరా రోడ్డు కోర్ట్ సమీపంలో 45 వేల విస్తీర్ణంలో కొత్తగా నిర్మించిన జీవీ మాల్ 17వ బ్రాంచ్ ను శనివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ జీవీ మాల్ గ్రూప్స్ కస్టమర్లకు వస్త్రాల్లో క్వాలిటీని ఇస్తూ అంచెలంచెలుగా ఎదగడం అభినందనీయమన్నారు. హైదరాబాద్ తరహాలో ఖమ్మంలో అన్ని రకాల వస్త్రాలను ప్రజలకు అందుబాటులోకి తేవడం సంతోషంగా ఉందన్నారు.
జీవీ మాల్ సంస్థ నిర్వాహకులు ఇటీవల మున్నేరు వరద బాధితులకు తమ వంతుగా ఆర్థిక సహాయం అందజేశారని గుర్తు చేశారు. జీవీ మాల్స్ లో 4 వేలమందికి ఉపాధి కల్పించడం హర్షనీయమన్నారు. షో రూం అధినేతలు గుఱ్ఱం ఉమామహేశ్వరరావు, గుఱ్ఱం వాసు, గుఱ్ఱం మురళీ మాట్లాడుతూ తాము ఎప్పుడు వ్యాపారాన్ని లాభాపేక్షగా చూడలేదన్నారు.
జీవీ మాల్స్ గ్రూప్స్ ద్వారా 10 వేల మందికి ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. అంతకుముందు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన హీరోయిన్ కీర్తి సురేశ్జ్యోతి ప్రజ్వలన చేశారు. వేదిక పైనుంచి ప్రజలకు అభివాదం చేస్తూ సందడి చేశారు. మాల్ లోని శారీలను కట్టుకుని సందడి చేశారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ జీవీ మాల్ లో అన్ని రకాల వస్త్రాలు ఉన్నాయని, ఖమ్మం ప్రజలు అధరించాలని కోరారు. షాపులో ఎక్కువ మంది మహిళలకు ఉపాధి కల్పించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సిటీ మేయర్ పూనుకొల్లు నీరజ, హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.