హనుమకొండ, వెలుగు : హనుమకొండలోని కీర్తి మోటార్స్ ఆధ్వర్యంలో కాజీపేట ఎన్‌ఐటీ సమీపంలో కొత్తగా ఏర్పాటు చేసిన మోంట్రా ఎలక్ట్రికల్ ఆటో షోరూం, వర్క్ షాప్‌ను రీజినల్ సేల్స్ హెడ్ కుమార్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోంట్రా ఎలక్ట్రికల్ ఆటో 10 కిలో వాట్ల బ్యాటరీ ప్యాక్, 203 కిలోమీటర్ల వరకు పరిధి ఉంటుందన్నారు. గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందని చెప్పారు.
4 గంటల్లోనే పూర్తిగా ఛార్జ్ అవుతుందని తెలిపారు. కీర్తి మోటార్స్ అధినేత చందుపట్ల కీర్తి రెడ్డి మాట్లాడుతూ ఎలక్ట్రికల్ ఆటోలకు ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంటుందన్నారు. కార్యక్రమంలో చందుపట్ల సత్యపాల్‌రెడ్డి, రీజినల్ సర్వీస్ హెడ్ సందీప్, తెలంగాణ సేల్స్ హెడ్ శ్రావణ్‌రెడ్డి, సర్వీస్ మేనేజర్ హరీశ్‌కుమార్ పాల్గొన్నారు.