భీమదేవరపల్లి,వెలుగు : ఆయిల్ ఫామ్ సాగుకు కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు వివిధ రకాల సబ్సిడీలను అందిస్తున్న దృష్ట్యా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తపల్లి, ఎల్కతుర్తి మండలం బావుపేట వద్ద ఆయిల్ పామ్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా హార్టికల్చర్, సెరికల్చర్ అధికారి శ్రీనివాస్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం ఉండడం వల్ల ప్రభుత్వం పెద్దఎత్తున ఆయిల్ పామ్ తోటలను ప్రోత్సహిస్తున్నదన్నారు.
రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కంపెనీల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఫ్యాక్టరీ జోన్ లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో హార్టికల్చర్ ఆఫీసర్ బి.మానస, కంపెనీ ప్రతినిధులు ఆయిల్ పామ్ జిల్లా కోఆర్డినేటర్ కే.రంజిత్, హేమంత్ కుమార్ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.