బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) గ్రూప్ బి, గ్రూప్ సీ విభాగాల్లో 144 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు బీఎస్ఎఫ్ అధికారిక వెబ్‌సైట్ లో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులు మే 19 నుంచి జూన్ 17 వరకు ఉంటుంది.
ఖాళీలు : మొత్తం 144 పోస్టుల్లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఫిజియోథెరపిస్ట్) -47, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్ఐ) ల్యాబ్ - 38, ఇన్‌స్పెక్టర్ లైబ్రేరియన్ - 2, సబ్ ఇన్‌స్పెక్టర్ ఎస్ఐ స్టాఫ్ నర్సు - 14, హెడ్‌కానిస్టేబుల్(వెటర్నరీ)- 4, కానిస్టేబుల్ కెన్నెల్మాన్ - 2 ఖాళీలు ఉన్నాయి.
అర్హత : పోస్టును బట్టి విద్యార్హత ఉండాలి. వయసు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో జూన్ 17 వరకు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు www.rectt.bsf.gov.in వెబ్ సైట్‌లో తెలుసుకోవచ్చు.