ఆదిలాబాద్​లో ఆపరేషన్  ఛబుత్రా..150 మంది యువకులకు కౌన్సెలింగ్

ఆదిలాబాద్​లో ఆపరేషన్  ఛబుత్రా..150 మంది యువకులకు కౌన్సెలింగ్

ఆదిలాబాద్, వెలుగు: పట్టణంలో ఎలాంటి పని లేకున్నా, అర్ధరాత్రి రోడ్ల వెంట తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్  డీఏస్పీ జీవన్ రెడ్డి హెచ్చరించారు. గురువారం అర్ధరాత్రి రోడ్లపై తనిఖీలు చేసి అనవసరంగా తిరుగుతున్న 150 మంది యువకులను పట్టుకున్నారు. వారికి కౌన్సిలింగ్  ఇచ్చి అనంతరం  తల్లిదండ్రులకు అప్పగించారు. జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్  ఛబుత్ర కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.

ప్రతి రోజు పట్టణంలో తనిఖీలు నిర్వహిస్తామని, పదేపదే పట్టుబడిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, యువత పెడదారి పట్టకుండా ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. పట్టణ సీఐలు సునీల్ కుమార్, కరుణాకర్, రూరల్  సీఐ ఫణిధర్, రిజర్వ్  ఇన్స్​పెక్టర్లు డి వెంకటి, టి మురళి, బి శ్రీపాల్, ఎన్ చంద్రశేఖర్, ఎస్సై ముజాహిద్  పాల్గొన్నారు.