కరోనా సోకిన గర్భిణీకి ఆపరేషన్..బిడ్డకు నెగిటివ్

వైజాగ్: కేజీహెచ్‌ లో డాక్టర్లు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. కోవిడ్‌తో తొమ్మిది నెలల గర్భిణీ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. అయితే శనివారం ఆమెకు పురిటీ నొప్పులు రావడంతో గర్భిణీకి ఆపరేషన్ చేసిన డాక్టర్లు బిడ్డను క్షేమంగా బయటకు తీశారు. వెంటనే శిశువుకి కరోనా పరీక్ష చేశారు. తల్లికి కరోనా సోకిన్నప్పటికీ.. బిడ్డకి నెగిటివ్ వచ్చింది. ప్రస్తుతం బిడ్డ క్షేమంగా ఉందని తెలిపిన డాక్టర్లు ..తల్లి ఐసీయూలో చికిత్స పొందుతుందన్నారు. కరోనాతో మహిళ బాధపడుతుండగా.. ఆమెకు పుట్టబోయే బిడ్డకు ప్రమాదం ఉంటుందేమోనని భయపడ్డామని తెలిపారు కుటుంబ సభ్యులు. అయితే శశువుకు కరోనా లేదని తెలియగానే అంతా ఊపిరిపీల్చుకున్నామని.. బిడ్డ తల్లి కూడా కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని వేడుకుంటున్నారు. కరోనా పేషెంట్ కు సర్జరీ చేసిన డాక్టర్లకు ధన్యవాదాలు తెలిపారు మహిళ కుటుంబ సభ్యులు.