పౌర హక్కుల నేత, ప్రొఫెసర్ హరగోపాల్
బషీర్ బాగ్,వెలుగు : ఆపరేషన్ కగార్ వెంటనే ఆపాలని పౌరహక్కుల నేత, ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం బలగాలను మోహరించి హత్య కాండను కొనసాగింస్తుందని ఆరోపించారు. చత్తీస్ గడ్ లో కేంద్ర ప్రభుత్వం కొనసాగించే'ఆపరేషన్ కగార్' హత్యాకాండపై జాతీయస్థాయి ప్రజాస్వామిక హక్కుల సమన్వయ సంస్థ, ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక సంయుక్తంగా మే 29 నుంచి జూన్ 3 వరకు నిర్వహించిన నిజ నిర్ధారణ కమిటీ రిపోర్టుపై మంగళవారం హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో మీడియా సమావేశం నిర్వహించారు.
ALSO READ : గ్రామీణంపై ప్రత్యేక దృష్టి
సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మిణ్, ప్రధాన కార్యదర్శి ఎన్.నారాయణ రావుతో కలసి హరగోపాల్ రిపోర్ట్ విడుదల చేసి మాట్లాడారు. మావోయిస్టుల పేరుతో అమాయక ఆదివాసీలను చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను అత్యాచారాలు, హత్య చేసి మావోయిస్టులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. బాధ్యులైన పోలీసు అధికారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేంద్రం కొనసాగించే హత్యకాండపై అందరూ స్పందించి సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.