హైదరాబాద్ నగర రోడ్లపై అడ్డగోలుగా ఉన్న మ్యాన్ హోల్స్ తో సిటీ జనం పరేషాన్ అవుతున్నారు. దాంతో ఆపరేషన్ మ్యాన్ హోల్స్ పేరుతో బల్ధియా వీటిని సరిచేసే పనిలో పడింది. మొదటి దశలో 20 కోట్లతో సిటీలోని రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మ్యాన్ హోల్స్ బాగు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ లో మ్యాన్ హోల్స్ ప్రమాదకరంగా మారాయి. కొన్నిచోట్ల రోడ్ల కు ఎత్తుగా ఉంటే.. మరికొన్ని చోట్ల కిందకు ఉన్నాయి. దీంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైవింగ్ లో ఉన్నప్పుడు సడెన్ గా వస్తున్న మ్యాన్ హోల్స్ తో ఒక్కసారిగా వెహికల్ ఎత్తు వొంపులకు గురవుతోందంటున్నారు. వాహనారుదాలు కింద పడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇక వర్షాకాలంలో అయితే మూతలు లేని మ్యాన్ హోల్స్ తో ప్రాణాలు మీదకు వస్తోంది. దాంతో మ్యాన్ హోల్స్ పై సీరియస్ గా దృష్టి పెట్టింది GHMC..
ఆపరేషన్ మ్యాన్ హోల్స్ పేరుతో పనులు చేపడుతోంది బల్ధియా. జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు ఆధ్వర్యంలో మొదటి దశలో నగరంలోని 2 వేల కిలోమీటర్ల మార్గంలో ఉన్న మ్యాన్ హోల్స్ ను సరిచేయాలని నిర్ణయించారు అధికారులు. దాదాపు 20 కోట్లతో ఈ పనులు చేపడుతున్నారు. ఇప్పటికే ఈ పనులను 49వర్క్ లుగా విభజించి.. టెండర్లను పూర్తి చేసినట్లు అధికారులు చెప్పారు.
నగరంలో మ్యాన్ హోల్స్ పై సర్వే నిర్వహించింది బల్ధియా. సిటీలో 9 వేల కిలోమీటర్ల రహదార్లుంటే.. అందులో మెయిన్ రోడ్లు రెండు వేల కిలోమీటర్ల వరకు ఉన్నాయి. ఈ మెయిన్ రోడ్లపై 20 వేల వరకు మ్యాన్ హోల్స్, క్యాచ్ పీట్లు, స్లూయిస్ వాల్వ్ చాంబర్లు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో జలమండలికి చెందినవి 12వేలుంటే.. జీహెచ్ఎంసీకి చెందిన మ్యాన్ హోల్స్ దాదాపు 8వేల వరకు ఉన్నట్లు చెబుతున్నారు అధికారులు. వీటన్నింటిని మే నెల 15లోపు రోడ్లకు సమాంతరంగా ఉండేలా చేస్తామంటున్నారు.
మూతలు లేని.. రోడ్లకు ఎత్తుగా, వంపుగా ఉన్న మ్యాన్ హోల్స్ తో నగరవాసులు పడుతున్న ఇబ్బందులపై దృష్టి పెట్టింది బల్ధియా. సిటీ రోడ్లపై వెహికిల్స్ స్మూత్ గా వెళ్లేలా చర్యలు చేపడుతోంది.