జనగామలో 30 మంది బాలకార్మికులకు విముక్తి

జనగామ, వెలుగు: ఆపరేషన్ ముస్కాన్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా జనగామ డివిజన్ టీం ఆధ్వర్యంలో బుధవారం దాడులు చేపట్టి 30 మంది బాలకార్మికులను గుర్తించి, బడిలో చేర్చించినట్లు ఎస్సై పిట్టల తిరుపతి తెలిపారు.

జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నిర్మాణ ప్రాంతాల్లో వీరిని గుర్తించినట్లు చెప్పారు. వలస కూలీల పిల్లలైన 24 మందిని పాఠశాలలో చేర్పించామన్నారు. వీరిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రవేశపెట్టి తల్లితండ్రులకు పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు.