
= ఇండియన్ మెరెయిన్ కమాండో ఫోర్స్ కూడా
= సొరంగం పక్క నుంచి మార్గాలను అన్వేషణ
నాగర్ కర్నూల్/మహబూబ్ నగర్/హైదరాబాద్: ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఇవాళ (ఫిబ్రవరి 26) ఆపరేషన్ లో మార్కోస్ టన్నెల్ జాయిన్ కానుంది. మరికాసేపట్లో టన్నెల్ వద్దకు ఇండియన్ మెరెయిన్ కమాండో ఫోర్స్ రానుంది. ఈ కమాండో టీం నేల, నీరు, ఆకాశంలో రెస్క్యూ కార్యక్రమాలు చేపడతారు.
ఆపరేషన్ మార్కోస్ రంగంలోకి దిగుతున్న నేపథ్యంలో టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులు బయటకు వస్తారని అందరూ ఆశిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకునేందుకు సొరంగంపై నుంచి కాని, పక్క నుంచి కానీ వెళ్లే మార్గాలను కూడా అన్వేషిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
శనివారం (ఫిబ్రవరి 22) ఉదయం కూలిపోయిన టన్నెల్ లో ఎనిమిది మంది చిక్కుకున్నారు. వారితో ఇద్దరు ఇంజినీర్లు, ఇద్దరు ఆపరేటర్లు, నలుగురు కార్మికులు ఉన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత కొన్ని వందల టన్నుల బరువున్న టన్నెల్ బోరింగ్ మెషిన్ దాదాపు 200 మీటర్ల దూరం కొట్టుకుపోయిందని, నీరు ఉప్పొంగడం వల్ల ఇది జరిగిందని అధికారులు చెబుతున్నారు.