ఆపరేషన్ రావణ్ ..  న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ 

ఆపరేషన్ రావణ్ ..  న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ 

రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఆపరేషన్ రావణ్’. రాధికా శరత్ కుమార్ కీలకపాత్ర పోషిస్తున్నారు. సంగీర్తన విపిన్ హీరోయిన్. న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్‌‌గా దర్శకుడు వెంకట సత్య.. తెలుగు, తమిళ బాషల్లో తెరకెక్కిస్తున్నాడు. మూవీ రిలీజ్‌‌‌‌ డేట్‌‌‌‌ను బుధవారం ప్రకటించారు.  ఆగస్టు 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ సందర్బంగా విడుదల చేసిన పోస్టర్‌‌‌‌‌‌‌‌లో రక్షిత్ స్టిల్‌‌‌‌ ఆకట్టుకుంది. ఓ సైకో స్టోరీ అనే క్యాప్షన్‌‌‌‌ ఆసక్తి రేపుతోంది.  చరణ్ రాజ్, తమిళ నటుడు విద్యా సాగర్, కాంచి, రాకెట్ రాఘవ, రఘు కుంచె ఇతర ముఖ్యపాత్రలు  పోషిస్తున్నారు.