ఆపరేషన్ ​స్మైల్.. బాల కార్మికులకు విముక్తి

ఆపరేషన్ ​స్మైల్.. బాల కార్మికులకు విముక్తి

ఇబ్రహీంపట్నం, వెలుగు:  జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్​ స్మైల్​లో భాగంగా 80  మంది  బాలకార్మికులకు పోలీసులు విముక్తి కల్పించారు.  ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, ఆదిబట్ల, మాడ్గుల, గ్రీన్​ ఫార్మాసిటీ పోలీస్​ స్టేషన్ల పరిధిలో ఒక ఆపరేషన్​ స్మైల్ ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. 

ఆయా పోలీస్​ స్టేషన్ల పరిధిలో  ప్రత్యేక టీం 50 మందిని, పోలీసులు 30 మంది బాలకార్మికులను గుర్తించారు.  బాల కార్మికులతో పనులు చేయిస్తున్న వారిపై 70కి పైగా కేసులు నమోదు చేశారు. బాలకార్మికులతో ఎక్కడైనా పనులు చేయిస్తే  చైల్డ్​ ప్రొటెక్షన్​ సొసైటీని సంప్రదించాలని ఆ సంఘం ప్రతినిధి ప్రవీణ్​​కుమార్​ కోరారు.