దేశంలో 1973 ఏప్రిల్ 1న ఆపరేషన్ టైగర్ ప్రాజెక్టును ప్రారంభించారు. దేశంలో మొత్తం 53 టైగర్ రిజర్వ్‌లున్నాయి. కర్ణాటక రాష్ట్రం బందీపూర్లో దేశంలో తొలి టైగర్ రిజర్వును ఏర్పాటు చేశారు. చివరగా ఛత్తీస్‌గఢ్‌లోని గురు ఘాసిదాస్ జాతీయ పార్కును 53వ టైగర్ రిజర్వ్‌గా ప్రకటించారు.
పులుల మనుగడ, వ్యాప్తిని నిర్ధారించే లక్ష్యంతో తెలంగాణలో రెండు పులుల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వు నల్లమల కొండ ప్రాంతాల్లో ఉంది. అంతేకాకుండా మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో మొత్తం 2,611 చ.కి.మీ.ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. కవాల్ టైగర్ రిజర్వ్ మొత్తం 2015 చ.కి.మీ. విస్తీర్ణంలో మహారాష్ట్రలోని తడోబా అంధేరి టైగర్ రిజర్వ్, ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్‌కు ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతాల్లో విస్తరించి ఉంది. కవాల్, ఇతర్ రెండు రిజర్వ్‌ల మధ్య పులులు వలస వెళ్లడాన్ని గమనించవచ్చు.
జాతీయపార్కులు/ అభయారణ్యాలు
ప్రాణహిత 1980
కవ్వాల్ 1980
శివ్వారం 1980
కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్ 1998
మహావీర్ హరిణవనస్థలి 1975
మృగవని 1994
ఏటూరు నాగారం అభయారణ్యం 1952
కిన్నెరసాని 1952
పోచారం అభయారణ్యం 1952
అమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రం 1983
మంజీరా అభయారణ్యం 1978