ఎన్‌‌‌‌పీడీసీఎల్‌‌‌‌లో డిగ్రీతో​ ఆపరేటర్​ జాబ్స్​

వెలుగు, ఎడ్యుకేషన్​ డెస్క్​ :  వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ  (ఎన్​పీడీసీఎల్​)  డైరెక్ట్​ రిక్రూట్ మెంట్ ద్వారా 100 జూనియర్​ అసిస్టెంట్​ కమ్​ కంప్యూటర్​ ఆపరేటర్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో  95 శాతం పోస్టులను ఎన్​పీడీసీఎల్​ పరిధిలోని 18 జిల్లాల అభ్యర్థులకు,  5 శాతం పోస్టులను ఇతరులకు కేటాయించారు. అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాలి. ఎగ్జామ్​ సెలెక్షన్​ ప్రాసెస్​, నోటిఫికేషన్ వివరాలు తెలుసుకుందాం...

ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోకి వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగామ, మహబూబాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలు వస్తాయి. ఈ జిల్లాల అభ్యర్థులకు 95 శాతం ఉద్యోగాలు లభిస్తాయి. బీఏ/బీఎస్సీ/బీకామ్‌‌‌‌తో పాటు కంప్యూటర్‌‌‌‌ అప్లికేషన్‌‌‌‌/ ఆఫీస్‌‌‌‌ ఆటోమేషన్‌‌‌‌ (ఎంఎస్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌) సర్టిఫికెట్‌‌‌‌ కోర్సు పాసైనవారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. వయసు 2023 జనవరి 1 నాటికి 18  నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. గరిష్ట వయసులో ఎస్సీ/ఎస్టీ/బీసీ/ ఈడబ్య్యూఎస్‌‌‌‌ అభ్యర్థులకు 5 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ళు, ఎక్స్‌‌‌‌సర్వీస్‌‌‌‌మెన్‌‌‌‌లకు మూడేళ్ల సడలింపు ఉంటుంది. రాత పరీక్ష మే 28న నిర్వహిస్తారు. పరీక్ష తేదీకి ముందు హాల్‌‌‌‌టికెట్‌‌‌‌ను వెబ్‌‌‌‌ సైట్‌‌‌‌ నుంచి డౌన్‌‌‌‌లోడ్‌‌‌‌ చేసుకోవాలి. పరీక్షలో సాధించిన మార్కులు, ఎక్స్​పీరియన్స్​, సర్టిఫికేట్​ వెరిఫికేషన్​ ఆధారంగా అభ్యర్థుల ఫైనల్​ సెలెక్షన్​ ఉంటుంది.

రాత పరీక్ష:  ఎగ్జామ్​ ఆబ్జెక్టివ్‌‌‌‌ విధానంలో  రెండు గంటలు నిర్వహిస్తారు. ఓఎంఆర్‌‌‌‌ బేస్డ్ విధానంలో పరీక్ష ఉంటుంది. రాత పరీక్షలో ఓసీ, ఈడబ్ల్యూఎస్‌‌‌‌, ఎక్స్‌‌‌‌-సర్వీస్‌‌‌‌మెన్‌‌‌‌ అభ్యర్థులు 40 శాతం కనీస అర్హత మార్కులను సాధించాలి. బీసీలకు 35శాతం, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్​ అభ్యర్థులు 30 శాతం మార్కులు రావాలి. రాత పరీక్ష హైదరాబాద్‌‌‌‌ జీహెచ్‌‌‌‌ఎంసీ, వరంగల్‌‌‌‌ జీడబ్లూఎంసీ పరిధిలోని వివిధ సెంటర్స్​లో నిర్వహిస్తారు. క్వశ్చన్​ పేపర్​ తెలుగు, ఇంగ్లీష్‌‌‌‌  మీడియంలో ఉంటుంది. ఇందులో మూడు సెక్షన్లు ఉంటాయి. -సెక్షన్​–ఎ లో న్యూమరికల్‌‌‌‌ ఎబిలిటీ అండ్‌‌‌‌ లాజికల్‌‌‌‌ రీజనింగ్‌‌‌‌ నుంచి 40 ప్రశ్నలు (40 మార్కులు). సెక్టన్‌‌‌‌–బీ లో కంప్యూటర్‌‌‌‌ అవేర్‌‌‌‌నెస్‌‌‌‌ నుంచి 20 ప్రశ్నలు (20 మార్కులు). సెక్టన్‌‌‌‌–సీ లో ఇంగ్లీష్‌‌‌‌ లాంగ్వేజ్‌‌‌‌ ప్రొఫిషియన్సీ ఆండ్‌‌‌‌ జనరల్‌‌‌‌ నాలెడ్జ్‌‌‌‌ 20 ప్రశ్నలు (20 మార్కులు) ఉంటాయి.
    

  • సెక్షన్‌‌‌‌–-ఎ లో ఉన్న న్యూమరికల్‌‌‌‌ ఎబిలిటీ సబ్జెక్టు నుంచి ప్రాఫిట్‌‌‌‌ అండ్‌‌‌‌ లాస్‌‌‌‌, మెన్సురేషన్‌‌‌‌, ఆల్జీబ్రా, రేషియోస్‌‌‌‌, ప్రపోర్షన్స్‌‌‌‌, జామెట్రీ అండ్‌‌‌‌ స్టాటిస్టిక్స్‌‌‌‌ ఉంటాయి. లాజికల్‌‌‌‌ రీజనింగ్‌‌‌‌ అండ్‌‌‌‌ డెసిషన్‌‌‌‌ మేకింగ్‌‌‌‌ ఆండ్‌‌‌‌ ప్రాబ్లమ్‌‌‌‌ సాల్వింగ్‌‌‌‌ అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
  • సెక్షన్​–బీలో కంప్యూటర్‌‌‌‌ అవేర్‌‌‌‌నెస్‌‌‌‌లో ఎంఎస్‌‌‌‌-–ఆఫీస్‌‌‌‌, బీసిక్​ కాన్సెప్ట్స్​ ఆఫ్​ కంప్యూటర్స్, కంప్యూటర్​ అప్లికేషన్స్​ అండ్​ స్కిల్స్​, అకౌంట్స్ రిలేటెడ్ సాఫ్ట్​వేర్​ అంశాల మీద ఎక్కువగా ఫోకస్​ చేయాలి. 
  • సెక్షన్​–సీ లో ఇంగ్లీష్‌‌‌‌ లాంగ్వేజ్‌‌‌‌ ప్రొఫిషియెన్సీ, కాంప్రహెన్షన్ పాసేజెస్‌‌‌‌ అండ్‌‌‌‌ రీ అరేంజ్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ సెంటెన్సెస్‌‌‌‌, సినోనిమ్స్‌‌‌‌ అండ్‌‌‌‌ యాంటనిమ్స్‌‌‌‌ టాపిక్స్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.

జనరల్‌‌‌‌ నాలెడ్జ్​ విభాగం నుంచి కరెంట్‌‌‌‌ అఫైర్స్‌‌‌‌,  కన్సూమర్‌‌‌‌ రిలేషన్స్‌‌‌‌, జనరల్‌‌‌‌ నైన్స్‌‌‌‌ ఇన్‌‌‌‌ ఎవ్రిడే లైఫ్‌‌‌‌, ఎన్విరాన్‌‌‌‌మెంటల్‌‌‌‌ ఇష్యూస్‌‌‌‌ అండ్‌‌‌‌ డిజాస్టర్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ ఆఫ్‌‌‌‌ ఇండియా, తెలంగాణ చరిత్ర, ఉద్యమం, తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వ సంపద, కళలు, సాహిత్యం మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. క్వశ్చన్​ పేపర్​ 80 మార్కులకు, ఇన్‌‌‌‌సర్వీస్‌‌‌‌ వెయిటేజి 20 మార్కులు ఉంటాయి. ఉద్యోగప్రకటన జారీ చేసిన నాటికి టీఎస్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌కో/ టీఎస్‌‌‌‌ ఎస్‌‌‌‌పీడీసీఎల్‌‌‌‌/ టీఎస్‌‌‌‌ ఎస్​పీడీసీ ఎల్‌‌‌‌ పనిచేస్తున్నవారికి వెయిటేజీ మార్కులు ఉంటాయి. ఆరునెలలకు 1 మార్కు చొప్పున ఇస్తారు. రాత పరీక్షలో సాధించిన మార్కులకు వీటిని కలుపుతారు. ఆరు నెలల కంటే తక్కువ సర్వీసు ఉంటే వెయిటేజీ మార్కుల నియమం వర్తించదు.

రిజర్వేషన్లు: వివిధ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు  ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఈడబ్ల్యూఎస్‌‌‌‌లకు 10 శాతం, బీసీలకు 25 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం, పీహెచ్‌‌‌‌లకు 1 శాతం, ఎక్స్‌‌‌‌సర్వీస్‌‌‌‌మెన్‌‌‌‌కు 2 శాతం, మహిళలకు 33 ;1/3 శాతం రిజర్వేషన్లు ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల కాలానికి ట్రైనింగ్‌‌‌‌ కమ్‌‌‌‌ ప్రొబేషన్‌‌‌‌ ఉంటుంది. విధుల్లో చేరే నాటికి ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌సీ, డిగ్రీ క్యాస్ట్‌‌‌‌ అండ్‌‌‌‌ స్టడీ/ రెసిడెన్స్‌‌‌‌ ఒరిజినల్‌‌‌‌ సర్టిఫికెట్లు చూపించాలి. ఉద్యోగంలో చేరే  సమయంలో ఐదేళ్లకు బాండ్‌‌‌‌ రాయాలి.

 

నోటిఫికేషన్​ 

అర్హత: బీఏ, బీఎస్సీ, బీకాంతోపాటు కంప్యూటర్‌‌‌‌ అప్లికేషన్‌‌‌‌/ ఆఫీస్‌‌‌‌ ఆటోమేషన్‌‌‌‌(ఎంఎస్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌) సర్టిఫికేట్‌‌‌‌ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 18 నుంచి 44 ఏండ్ల మధ్య ఉండాలి.  నెలకు రూ.29,255 నుంచి రూ.54,380 వేతనం చెల్లిస్తారు.
సెలెక్షన్: రాతపరీక్ష (80 మార్కులు), సంబంధిత అనుభవం(20 మార్కులు), సర్టిఫికేట్ వెరిఫికేషన్​ ఆధారంగా ఎంపిక.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్​ 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష మే 28న నిర్వహిస్తారు. వివరాలకు www.tsnpdcl.in వెబ్​సైట్​ సంప్రదించాలి.