ఎస్సీ వర్గీకరణపై సెప్టెంబర్ 30 నుంచి అభిప్రాయ సేకరణ

ఎస్సీ వర్గీకరణపై సెప్టెంబర్ 30 నుంచి అభిప్రాయ సేకరణ

హైదరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ అంశంపై వివిధ సంఘాలు, వ్యక్తుల అభిప్రాయాలను తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్టడీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం రెండోసారి సమావేశమైంది. 

ఉపసంఘం తాజా నిర్ణయం మేరకు ఈ నెల 30 నుంచి అన్ని పనిదినాల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సేకరిస్తారు. మాసాబ్​ ట్యాంక్​లోని డీఎస్ఎస్​ భవన్​లో ఎస్సీ అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్​ కె.కిషన్, అసిస్టెంట్​ డైరెక్టర్​ ఎస్.సుబ్బలక్ష్మి కార్యాలయల్లో ఆఫ్​లైన్​లోనూ అభిప్రాయాలు తెలియజేయవచ్చు. 

అలాగే ఈ మెయిల్​ ద్వారా commr.scsubclassification@gmail.com కు అభిప్రాయాలు పంపించవచ్చని ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీ వెల్లడించారు.