Oppo తన స్మార్ట్ ఫోన్ సిరీస్ లో సరికొత్త డివైజ్ Oppo A60 ని విడుదల చేసింది. తక్కువధలో 90Hz రిఫ్రెష్ రేట్, 6.67 అంగుళాల LCD స్క్రీన్ను కలిగిఉంది. ఇది Qu alcomm స్నాప్ డ్రాగన్ 680 చిప్తో పాటు 8GB RAM, 256 GB స్టోరేజ్ తో వనిచేస్తుంది. హ్యాండ్ సెట్ 45W ఛార్జింగ్ కు మద్దుతో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, సెల్ఫీలకు 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో ఈ మొబైల్ ఫోన్ వస్తుంది.
Oppo A60 ధర, లభ్యత
Oppo A60 స్మార్ట్ ఫోన్ 8GB RAM, 258GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 18,060, అయితే 8GB RAM, 256 GB ధర రూ.21,360. హ్యాండ్ సెట్ మిడ్ నైట్ పర్పుల్, రిప్పల్ బ్లూ రెండు కలర్లతో వస్తుంది. ఈ హ్యాండ్ సెట్ ను మొదట వియత్నాంలో శుక్రవారం(ఏప్రిల్ 26) విడుదల చేశారు. త్వరలో భారత దేశంలో కూడా విడుదల చేసే అవకాశం ఉంది.
Oppo A60స్పెసిఫికేషన్స్
Oppo A60 డ్యుయెల్ సిమ్ (నానో), Adroid 14 ఆధారిత Color OS 14.0.1పై నడుస్తుంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్, 6.67 అంగుళాల HD+720x1,604 పిక్సెల్ LCD స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది 8GB LPDDR4X RAMతో జత చేయబడిన ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 680 చిప్ తో రన్ అవుతుంది.
ఫొటోలు, వీడియోలకోసం Oppo A 60 f/1.8 ఎపర్చరు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. ఇది డెప్త్ ఫొటోలను సేకరించేందుకు ఉపయోగించబడే f/2.4 ఎపర్చర్ తో, 2 మెగా పిక్సెల్ సెకండరనీ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ స్మార్ట్ ఫోన్ ఫ్రంట్ లో 8 మెగా పిక్సెల్ సెల్ఫీకెమెరాను కలిగి ఉంటుంది.
కంపెనీ ఈ హ్యాండ్ సెట్లో గరిష్టంగా 256GB స్టోరేజ్, కనెక్టివిటీ కోసం 4G WiFi, 5.0 బ్లూటూత్, NFC, GPS, A GPS, USB టైప్ C పోర్ట్, 3.5mm ఆడియో జాక్ తో ఉంది. బోర్డులోని సెన్సార్ లలో మాగ్నటోమీటర్, యాక్సిలరోమీటర్, లైట్ సెన్సార్ ఉన్నాయి.
Oppo A60 స్మార్ట్ ఫోన్..45W వద్ద ఛార్జ్ చేయగల సామర్థ్యంతో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్ సెట్ లో సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది.