6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఒప్పో ఎఫ్​29 ప్రో స్మార్ట్ ఫోన్.. రేటు గట్టిగానే ఉందిగా..

6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఒప్పో ఎఫ్​29 ప్రో స్మార్ట్ ఫోన్.. రేటు గట్టిగానే ఉందిగా..

ఒప్పో తన తాజా మిడ్-రేంజ్ స్మార్ట్‌‌‌‌ఫోన్ ఒప్పో ఎఫ్​29 ప్రో ఫోన్​ను లాంచ్​  చేసింది. ఈ స్మార్ట్‌‌‌‌ఫోన్​లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్‌‌‌‌సెట్‌‌‌‌, 6,000 ఎంఏహెచ్​ బ్యాటరీ, 6.7-అంగుళాల డిస్​ప్లే, 50ఎంపీ మెయిన్​ కెమెరా,  2ఎంపీ సెకండరీ సెన్సర్‌‌‌‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌‌‌‌, సెల్ఫీల  కోసం 16ఎంపీ ఫ్రంట్ కెమెరా, 12జీబీ వరకు ర్యామ్​, 256 జీబీ వరకు స్టోరేజీ ఉంటాయి. ధరలు రూ.28 వేల నుంచి మొదలవుతాయి.