ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ Oppo తన కొత్త ఫోన్లను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. నవంబర్ 21 న Find X8 సిరీస్ తో Find X8 ,Find X8 ప్రో స్మార్ట్ ఫోన్లను కొత్త Color OS15 సిస్టమ్ తో భారత్ లో విడుదల చేస్తుంది.
Oppo Find X8,Oppo Find X8 ప్రో.. ఇటీవల చైనాలో విడుదల చేశారు. నవంబర్ 21 న ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. ఈ రెండు స్మార్ట్ ఫోన్లకు సంబంధిన ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్ల గురించి తెలుసుకుందాం.
Oppo Find X8 స్పెసిఫిక్స్..
Oppo Find X8 స్మార్ట్ ఫోన్ 6.59 అంగుళాల AMOLED డిస్ ప్లేతో వస్తుంది. 400 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, 2160H ఇన్ స్టంట్ టచ్ శాంప్లింగ్ డాల్బీ విజన్, ఒప్పో క్రిస్టల్ షీల్డ్ కు సపోర్టు చేస్తుంది. ఈ డివైజ్ MediaTek డైమెన్సిటీ 9400 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో గ్రాఫిక్స్ వర్క్ కోసం Immortalis G925 GPUతో జత చేయబడింది. ఇది 16 GB వరకు LPDDR5X RAM, 1TB వరకు UFS 4.0 స్టోరేజీకి సపోర్టు చేస్తుంది.
కెమెరా విషయానికి వస్తే.. ఆప్టిక్స్ ముందు Find X8 OIS ,10bit HDRతో 50 MP Sony LYT700 ప్రైమరీ షూటర్, 50MP Samsung S5KJN5 అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 50MP SonyLYT600 టెలిఫొటో లెన్స్ తో 3x ఆప్టికల్ జూమ్ నుంచి 120x వరకు అందిస్తుంది. ఇక ఫ్రంట్ కెమెరాలో సెల్ఫీలు, వీడియోకాల్స్ కోసం 32MP Sony IMX165 సెన్సార్ కి సపోర్ట్ చేస్తుంది.
Oppo ఫైండ్ X8 ప్రో స్పెసిఫికేషన్స్:
Oppo Find X8 Pro పెద్ద 6.8inch మైక్రో కర్వ్డ్ LTPO AMOLED డిస్ ప్లే ఉంటుంది.MediaTek డైమెన్సిటీ 9400 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇది 50MP సోనీ లిటియా LYT808 ప్రైమరీ షూటర్, 50MP Samsung S5KJN5 అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ , 50MP Sony LYT-600 టెలిఫోటో లెన్స్ ఈ డివైజ్ లో ఉంటాయి. ప్రో వెర్షన్ 6x ఆప్టికల్ జూమ్ , 120X డిజిటల్ జూమ్‌తో మరో 50MP Sony IMX858 6x టెలిఫోటో లెన్స్‌ను కూడా పొందుతుంది. సెల్ఫీ కెమెరా 32MP సోనీ IMX615 షూటర్‌తో Find X8 వలెనే ఉంటుంది.
రెండు ఫోన్లు Android 15 ఆధారంగా సరికొత్త ColorOS 15తో రన్ అవుతాయి. డస్ట్ ఫ్రూఫ్, వాటర్ ఫ్రూఫ్ కోసం IP68/69 రేట్ చేయబడ్డాయి. ఈ రెండు డివైజ్ లలో డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో స్టీరియో స్పీకర్ సెటప్ , ఇన్‌ఫ్రారెడ్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంటాయి.
Find X8 డివైజ్5,630mAh బ్యాటరీతో వస్తుంది. అయితే X8 Pro డివైజ్ లో మాత్రం 5,910mAh కెపాసిటీ బ్యాటరీ ఉంటుంది. రెండు డివైజ్ లు 80W Super VOOC ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి.