Oppo Reno 13 సిరీస్ స్మార్ట్ఫోన్ల డిజైన్ రివీల్..కెమెరా సిస్టమ్ అదుర్స్..

Oppo Reno 13 సిరీస్ స్మార్ట్ఫోన్ల డిజైన్ రివీల్..కెమెరా సిస్టమ్ అదుర్స్..

Oppoకొత్త సిరీస్ Reno 13 5G స్మార్ట్ఫోన్లను  ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు రెడీ అవుతోంది.ఇప్పటికే చైనాలో ఈ ఫ్లోన్లు రీలీజ్ అయ్యాయి. Oppo Reno 13 5G సిరీస్ నవంబర్‌లో చైనాలో విడుదల చేశారు. త్వరలో ఇండియాలో కూడా లాంచ్ చేయనున్నారు. 

Oppo Reno 13 5G, Oppo Reno 13Pro 5G  స్మార్ట్ ఫోన్లకు సంబంధిం చిన వీడియో టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ ద్వారా రాబోయే కొత్త సిరీస్ స్మార్ట్ఫోన్ల ముఖ్య మైన డిజైన్లను వెల్లడించింది. ఈ డివైజ్లకు సంబంధించిన ఫీచర్లను పంచుకున్నారు. 

Oppo Reno 13 5G సిరీస్ డిజైన్

Oppo Reno 13 5G సిరీస్ గ్లోబల్ వేరియంట్ హ్యాండ్ సెట్ల డిజైన్లను Oppo తన సోషల్ మీడియాలో ప్లాట్ ఫాంX లో షేర్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్లు బటర్ షాడో డిజైన్ తో ఆకట్టుకుంటున్నాయి.  

బ్యాక్ ప్యానెల్ పలక గాజుతో తయారు చేయబడింది.బ్యాక్ ప్యానెల్స్  సీతాకోకచిలుక షేప్ ఆకారాన్ని కలిగి ఉంటాయి. అంతేగాదు ఈ డివైజ్ లు అల్యూమినియం మిడిల్ ఫ్రేమ్‌లతో వస్తున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్లలో ఫ్లాట్ డిస్‌ప్లేలు అల్ట్రా- స్లిమ్ బెజెల్స్‌తో వస్తున్నాయి. 

ఈ రెండు స్మార్ట్ డివైజ్ లలో బ్యాక్ ప్యానెల్ ఎడమవైపు పై కార్నర్ లో రౌండెడ్ ఎడ్జ్ తో రెక్టాంగులర్ రియర్ కెమెరా మాడ్యుల్ తో కెమెరా సెట్టింగ్ ఉంటుంది. కుడివైపు కార్నర్ లో వాల్యూమ్ రాకర్, పవర్ బటన్‌ను కలిగి ఉంటుంది.ఇక కింది అంచులో USB టైప్-C పోర్ట్ , స్పీకర్ గ్రిల్స్‌ను కలిగి ఉంది.

Oppo Reno 13 5G సిరీస్ ఫీచర్లు

Oppo Reno 13 5G హ్యాండ్ సెట్ల చైనీస్ వేరియంట్లు Media Tek Dimensity 8350 SoC ల ద్వారా పనిచేస్తుంది.  Oppo Reno 13 5G ప్రోలో 6.83-అంగుళాల పెద్ద డిస్ ప్లే ఉంటుంది. బేస్ వేరియంట్ 6.59 అంగుల ఫుల్ HD+AMOLED స్క్రీన్ ఉంటుంది.  

ఈ స్మార్ట్ ఫోన్లలో కెమెరా సిస్టమ్ అద్భుతంగా ఉంటుంది. సెల్ఫీలకోసం ఫ్రంట్ లో బెస్ట్ కెమెరా ఉంటుంది. ముందుభాగంలో 50 MP మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. బ్యాక్ ప్యానెల్ లో మొత్తం మూడు కెమెరాలు ఉంటాయి. 50 MP మెగాపిక్సెల్ డ్యూయెల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. దీంతోపాటు బ్యాక్ ప్యానల్ లో మూడో కెమెరా 50MP మెగా పిక్సెల్ టెలిఫొటో షూటర్ ఉంటుంది. 

ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే.. 5800mAh సామర్థ్యం గల బ్యాటరీ ఉంటుంది. రెండు ఫోన్లు కూడా 80W వైర్డ్, 50 W వైర్ లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తాయి. 

ఈ Oppo Reno 13 5G సిరీస్ లో రెండు స్మార్ట్  ఫోన్లు వచ్చే ఏడాది 2025లో లాంచ్ అవుతాయని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.. లాంచింగ్ డేట్ కన్ఫర్మ్ చేయనప్ప టికీ.. 2025 జూన్ లో ఈ రెండు స్మార్ట్ ఫోన్లు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.