
ముషీరాబాద్/బషీర్‌బాగ్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎస్సీ వర్గీకరణను తాము వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ మాలల ఐక్యవేదిక అధ్యక్షుడు బేర బాలకిషన్ స్పష్టం చేశారు. ఇది రాజ్యాంగానికి పూర్తిగా వ్యతిరేకమన్నారు. హైదరాబాద్‌లోని బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అక్తర్‌ను సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం బాలకిషన్ మాట్లాడుతూ వర్గీకరణ వల్ల అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయన్నారు. ఉప కులాల జాబితాలో మాల, మాల అయ్యవారు కులాలని వేరువేరుగా చూపాలన్నారు. అత్యంత వెనుకబడిన మాల కులస్తులకు వెంటనే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ. వెయ్యి కోట్ల కేటాయించాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో నర్సింగరావు, కిషన్, గంగం శివకుమార్, గోరేటి నాగరాజు, నవీన్‌రావు పాల్గొన్నారు.