ఇంటింటి సర్వేపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం:  టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ వినోద్ రెడ్డి 

సమగ్ర కులగణన నిర్వహించే అధికారులకు.. ఎన్యుమరేటర్లకు అండగా ఉంటామని  టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ వినోద్ రెడ్డి  తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్వేపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. పార్టీ కార్యకర్తలు కూడా ఎన్యుమరేటర్లకు సహకరించాలన్నారు. . 

కొన్ని ప్రాంతాల్లో ఎన్యుమరేటర్లపై దురుసుగా వ్యవహరిస్తున్న సంఘటనలు చోటు చేసుకున్నాయి.  ఇంటింటి సర్వేలో భాగంగా ప్రముఖులను కలిసే కార్యక్రమంలో  స్థానిక కార్పొరేటర్ మహాలక్ష్మీగౌడ్, డీఎంసీ మారుతి దివాకర్, నోడల్ అధికారి డాక్టర్ వనజ కుమారి, నారాయణగూడ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ ఇతర అధికారులు... ఎన్యుమరేటర్ల బృందం హిమాయత్ నగర్ లో నివాసం ఉండే టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ వినోద్ రెడ్డిని కలిశారు.   ఈ సందర్భంగా సర్వేలో ఎన్యుమరేటర్లు పడే కష్టాలను వినోద్​ కు వివరించారు.


 కొన్ని ప్రాంతాల్లో ప్రజలు  దురుసుగా ప్రవర్తిస్తున్నారని... అక్కడక్కడ దాడులు కూడ జరుగుతున్నాయని నోడల్ ఆఫీసర్ పిర్యాదు చేసారు. ఈ విషయంపై స్పందించిన ...  పీసీసీ వైస్ ప్రెసిడెంట్ వినోద్ రెడ్డి పోలీస్ ఉన్నతాధికారులకు , హైదరాబాద్ కలెక్టర్ లకు ఫోన్ చేసి ఎన్యుమరేటర్లు పడుతున్న ఇబ్బందులు చెప్పారు. ఎన్యుమరేటర్లపై ఎవరైన దురుసుగా ప్రవర్తించినా.. దాడులకు పాల్పడిన తమకు సమాచారాన్ని అందించాలని పోలీసు అధికారులు తెలిపారు.