పార్లమెంటులో ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానాన్ని ఓడించి..అసత్య ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలకు తగిన సమాధానం చెప్పామన్నారు ప్రధాని మోదీ.. పశ్చిమ బెంగాల్ లోని బీజేపీ క్షేత్రీయ సంచాయతీరాజ్ పరిషత్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన విపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మణిపూర్ విషయంలో ప్రతిపక్షాలు రాజకీయం చేశాయన్నారు. ప్రతిపక్షం మణిపూర్ ప్రజలకు మాత్రమే ద్రోహం చేసిందన్నారు. ప్రతిపక్షాలు మణిపూర్ గురించి అస్సలు చర్చించదలుచుకోలేదని.. పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం పెట్టి ఓటింగ్‌కు దూరంగా పారిపోయారని విమర్శించారు. అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని భయపడి.. ప్రతిపక్ష సభ్యులు పార్లమెంట్ మధ్యలోనే వెళ్లిపోయారని మోదీ అన్నారు.