లోక్సభ నుంచి విపక్షాల వాకౌట్

లోక్సభ నుంచి విపక్షాల వాకౌట్

లోక్ సభ నుంచి ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి.  నీట్ పై చర్చకు పట్టుబట్టాయి ఇండియాకూటమి సభ్యులు.  స్పీకర్ తిరస్కరించడంతో  ఇండియా కూటమి సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

 లోక్ సభ ప్రారంభం కాగానే.. కొత్తచట్టాలు,నీట్ పై చర్చకు వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది కాంగ్రెస్. సభలో ఒక్క రోజు నీట్ పై చర్చించాలని రాహుల్ పట్టబట్టారు.  విద్యార్థులకు సభ నుంచి ఒక్క సందేశం ఇవ్వాలని కోరారు. అయితే నోటీసులిస్తే పరిశీలిస్తామని స్పీకర్ అన్నారు. దీంతో విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. నీట్ పై చర్చ జరగాల్సిందేనని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశాయి. అయితే... సభా కార్యక్రమాలకు అడ్డుపడడంపై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని చెప్పారు.  దీంతో స్పీకర్ తీరుకు నిరసనగా ఇండియా కూటమి సభ్యులు లోక్ సభ నుంచి వాకౌట్ చేశారు.

అంతకుముందు పార్లమెంట్ కాంప్లెక్స్ ముందు ఆందోళన చేపట్టారు విపక్ష పార్టీల ఎంపీలు. దేశంలో కేంద్ర దర్యాప్తు ఏజేన్సీల దుర్వినియోగాన్ని నిరసిస్తూ ధర్నా చేశారు. ప్రతిపక్ష నేతలపై సీబీఐ, ఈడీ దాడులను ఆపాలని డిమాండ్ చేశారు లోక సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ విధానాన్ని ఖండిస్తున్నామన్నారు.  ప్రధాని మోదీ, కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.