మోడీ ప్రతిష్ఠ తగ్గించేందుకు ప్రతిపక్షాల కుట్ర ..బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ

వేములవాడరూరల్, వెలుగు: ప్రతిపక్షాలు తమ కుటిలనీతితో ప్రధాని మోడీ ప్రతిష్ఠను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఆరోపించారు. ఢిల్లీలో పార్లమెంట్​ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ఆదివారం వేములవాడ రాజన్న ఆలయంలో బీజేపీ నాయకులు కోడెమొక్కు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించి ప్రధాని మోడీ ప్రారంభిస్తుండగా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్, పట్టణ అధ్యక్షుడు సంతోష్,  జి.బాలరాజు, పిన్నింటి హనుమాండ్లు, సుదర్శన్​యాదవ్, ఎన్.శేఖర్, మనోజ్, సత్యం తదితరులు పాల్గొన్నారు. 

బీజేవైఎం ప్రభారికి రాజన్న ప్రసాదం అందజేతబీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ లీగల్​ సెల్​ మీటింగ్​ హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు.  యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాశ్​ ఆధ్వర్యంలో బీజేవైఎం ప్రభారి ప్రదీప్​ కుమార్ దుగ్యాలను వేములవాడ లీడర్లు సత్కరించారు. రాజన్న స్వామివారి ఫొటో, ప్రసాదం అందజేశారు. 
కథలాపూర్, వెలుగు:  ప్రధాని మోడీ పార్లమెంట్ కొత్త భవనాన్ని  ప్రారంభించిన  సందర్భంగా కథలాపూర్ మండలంలోని దూలూరు గ్రామంలో రాముల వారి ఆలయంలో బీజేపీ లీడర్లు పూజలు చేశారు. ప్రధాని మోడీ ఆయురారోగ్యాలతో ఉండి, దేశ ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని కోరారు. బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడిపెల్లి గోపాల్ రెడ్డి, సర్పంచ్ దయలక్ష్మి, నరసయ్య, గంగాధర్, రాజారెడ్డి, చిన్నారెడ్డి, అనిల్ రెడ్డి , 
మీన్ రెడ్డి పాల్గొన్నారు.