శనివారం ( ఫిబ్రవరి 1, 2025 ) లోక్ సభలో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మోడీ 3.0లో ఇదే తొలి పూర్తి స్థాయి బడ్జెట్. మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రసంగం మొదలు కాగానే విపక్షాలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. కేంద్ర వైఖరికి నిరసనగా సమావేశాల నుండి వాకౌట్ చేశాయి విపక్షాలు. దీంతో సభలో విపక్షం లేకుండానే బడ్జెట్ ప్రవేశపెట్టారు మంత్రి నిర్మలా సీతారామన్. ఇదిలా ఉండగా.. గురజాడ పద్యం " దేశమంటే మట్టి కాదోయ్ " తో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు నిర్మల సీతారామన్.
ఎన్డీయే కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్ ప్రవేశ పెడుతోంది. సభలో విపక్షాలు ఆందోళన చేస్తుండగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం మొదలుపెట్టారు. కేంద్రం తీరుకు నిరసనగా విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. విపక్షాలు లేకుండానే బడ్జెట్ ప్రసంగం చదువుతున్నారు నిర్మలా సీతారామన్.
Also Read :- కేంద్ర బడ్జెట్ లైవ్ అప్ డేట్స్
నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం వరుసగా 8వ సారి కావడం గమనార్హం. అత్యధిక సార్లు మోరార్జీ దేశాయ్ పది సార్లు బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం తొమ్మిది సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో 8 సార్లు బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. కాసేపట్లో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టి ప్రణబ్ ముఖర్జీ(8 సార్లు) రికార్డ్ ను సమం చేశారు.