రాజ్యసభలో విపక్షాల తీరుపై ఛైర్మన్ జగదీప్ ధన్కడ్ అసంతృప్తి

రాజ్యసభలో విపక్షాల తీరుపై ఛైర్మన్ జగదీప్ ధన్కడ్ అసంతృప్తి

 రాజ్యసభలో విపక్షాల తీరుపై ఛైర్మన్ జగదీప్ ధన్కడ్ అసంతృప్తి  వ్యక్తం చేశారు. అసలేం జరిగిందంటే... రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ మాట్లాడుతుండగా రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీలు నీట్, మణిపూర్ అంశాలపై చర్చకు పట్టుబట్టారు. ప్రధాని అబద్ధాలు చెబుతున్నారని నినాదాలు చేయడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. అనంతరం ప్రధాని ప్రసంగాన్ని విపక్ష ఎంపీలు బహి ష్కరిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.  దీంతో విపక్షాల తీరును  చైర్మన్ ధన్కడ్ తప్పు పట్టారు.   

ఇవాళ అత్యంత బాధకారమైన అమర్యాదకరమైన రోజన్నారు. ప్రతిపక్షాలతో  చర్చలు జరిపి.. విజ్ఞప్తి చేసినా వినలేదన్నారు. వాళ్లు సభను కాదు.. మర్యాదను వదిలేశారంటూ  వ్యాఖ్యలు చేశారు.విపక్షాలు రాజ్యాంగాన్ని అవమానించాయన్నారు.  తనకు కాదు, వాళ్లు దేశ ప్రజలకు వెన్ను చూపారని...  రాజ్యాంగానికి ఇంతకంటే ఘోర అవమానం ఉండదన్నారు. విపక్షం ఆత్మవిమర్శ చేసుకుంటుందని భావిస్తున్నానని ధన్కడ్ అన్నారు.

అబాద్ధాలు చెప్పే వారికి నిజాన్ని వినే శక్తి లేదన్నారు ప్రధాని మోదీ.  తమ ప్రభుత్వం పదేండ్ల పాలన పూర్తి చేసుకుందని, ఇంకా ఇరవై ఏండ్లు మిగిలే ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాజ్యాంగాన్ని తాము గౌరవిస్తామని, రాజ్యాంగం వల్లే తాను ప్రధాన మంత్రిని అయ్యానని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వానికి రాజ్యాంగమే రక్ష అని చెప్పారు. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని మోదీ చెప్పారు.

తమపై విపక్షాలు ఎంత విష ప్రచారం చేసినా ప్రజలు నమ్మ లేదని, తమకే పట్టం కట్టారని అన్నారు. ప్రజాతీర్పును కొందరు జీర్ణించుకోలేక పో తున్నారని అన్నారు. ఎంత చెప్పినా విపక్షం వినకపోవడం బాధాకరమని పీఎం అన్నారు. అరవై ఏండ్ల తర్వాత వరుసగా ఒక పార్టీ మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు. వికసిత్ భారత్ సంకల్పంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. త్వర లోనే భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోబోతున్నదని చెప్పారు.