ప్రముఖ ఐటీ కంపెనీ ఒరాకిల్ కార్పోరేషన్ దాని ఒరాకిల్ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (OCI) డిపార్ట్ మెంట్లో ఉద్యోగులను తీసేస్తోందని సంస్థ అంచనా వేసింది. ఈ వారం చివరిలోగా ఒరాకిల్ అంతటా పెద్ద సంఖ్యలో ఉద్యోగ కోతలు ఉంటాయని ఆన్‌లైన్‌లో రిపోర్ట్ వచ్చింది. సైట్ TheLayoff.com ప్రకారం శుక్రవారం (నవంబర్ 1) ఒరాకిల్ 15 మంది ఉద్యోగులను తొలగించింది. అయితే ఈ వీకెండ్ లోగా ఆ కంపెనీలో చాలా మంది ఉద్యోగులను ఇంటికి పంపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఫేమస్ అయిన ఒరాకిల్ గతంలో కూడా ఉద్యోగులను తొలగించింది.
ఎక్కువ సాలరీలు ఉన్న ఉద్యోగులను తీసేసి వారి స్థానంలో ఫ్రెషర్లును తక్కువ జీతానికే నియమించుకునే ఆలోచనలో ఉన్నారు. లే ఆఫ్స్ ప్రధానంగా US ఆధారిత ఉద్యోగులపై ప్రభావం చూపుతున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. ఒరాకిల్ ఇతర ఎంప్లాయ్స్ ను తీసివేస్తున్నట్లు ప్రకటించి నెల రోజుల అవుతుంది. తర్వాత ఇప్పుడు మళ్లీ ఎంప్లాయ్స్ లే ఆఫ్స్ అని ఉద్యోగులకు సంకేతాలు ఇస్తోంది.