వరల్డ్ వైడ్గా ఉద్యోగాల తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. అనేక కార్పొరేట్ కంపెనీలు తమ ఖర్చుల భారాన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగులను తీసేస్తున్నాయి. గతేడాది నుంచి ఇప్పటిదాకా అనేక దిగ్గజ కంపెనీలు సుమారు 3 లక్షల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. తాజాగా టెక్ దిగ్గజం ఒరాకిల్ 3,000 మందికి పైగా ఉద్యోగులను నుంచి తొలగించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
క్లౌడ్ మేజర్ ఒరాకిల్ 28.4 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేసిన ఎలక్ట్రానిక్ హెల్త్‌కేర్ రికార్డ్స్ సంస్థ సెర్నర్‌లో 3 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. ఇన్‌సైడర్ నివేదిక ప్రకారం సెర్నర్ ను గత ఏడాది జూన్‌లో ఒరాకిల్ కొనుగోలు చేసిన తర్వాత ఉద్యోగులకు జీతాల పెంపు, ప్రమోషన్‌లను నిలిపివేసింది. అంతేకాకుండా 2023 డిసెంబర్ వరకు ఉద్యోగులు జీతాల పెంపు, ప్రమోషన్లను ఆశించకూడదని ప్రకటించింది. సెర్నర్ కొనుగోలు సమయంలో సంస్థలో దాదాపు 28,000 మంది ఉద్యోగులు ఉన్నారు.
సెర్నర్ సంస్థలో మార్కెటింగ్, ఇంజినీరింగ్, అకౌంటింగ్, లీగల్, ప్రొడక్ట్‌లతో సహా టీమ్‌లలోని ఉద్యోగులను తొలగించినట్లు ఓ మాజీ ఉద్యోగి తెలిపారు.