హైదరాబాద్ సిటీకి ఆరెంజ్ అలర్ట్

హైదరాబాద్ సిటీలో మరో రెండ్రోజుల పాటు భారీ వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం అతి భారీ వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంటూ ఆరెంజ్ అలర్ట్ (11.5 సెం.మీ నుంచి 20.4 సెం.మీల వర్షపాతం), గురువారం ఎల్లో అలర్ట్(6.4 సెం.మీ నుంచి 11.5 సెం.మీ వర్షపాతం నమోదయ్యే చాన్స్)ను జారీ చేసింది. సిటీలో మంగళవారం పొద్దంతా ముసురు పడగా.. సాయంత్రం 4 గంటల తర్వాత ఒక్కసారిగా భారీ వర్షం పడింది.

రోడ్లపై, లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు చేరి జనం, వాహనదారులు ఇబ్బంది పడ్డారు. భారీ వానల నేపథ్యంలో ఎమర్జెన్సీ అయితేనే బయటకు రావాలని సిటిజన్లకు మేయర్ విజయలక్ష్మి సూచించారు

ALSO READ :మాకెందుకు ఇన్ని రూల్స్? రెగ్యులర్ ప్రాసెసింగ్​పై జేపీఎస్​ల ఫైర్