తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

తెలుగు రాష్ట్రాల్లో  ఆదివారం ( సెప్టెంబర్​ 8) నుంచి  తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో సెప్టెంబర్ 08, 09, 10 తేదీల్లో అతి భారీ వర్షాలు పడుతాయని హైదారబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది.  తెలంగాణలో మరో మూడు  రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోందని ఐఎండీ వెల్లడించింది. సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మధ్య బంగాళాఖాతం, అనుకుని ఉన్న ఉత్తర బంగాఖాఖాతం మీద ఉందని ఐఎండీ వివరించింది. దానికి అనుబంధంగా ఉపరితల అవర్తనం సముద్రమట్టానికి సగటున 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపింది. సెప్టెంబర్ 9వ తేదీ నాటికి ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్ తీరంలోని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనంగా మారుతుందని అంచనా వేసింది. తెలంగాణలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఆరంజ్​  హెచ్చరికలను జారీ చేసింది. సెప్టెంబర్ 8 నుంచి మళ్లీ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ALSO READ | రాష్ట్రంలో 4 రోజులు వర్షాలు : 2 రోజులు ఎల్లో, 2 రోజులు ఆరెంజ్ అలర్ట్

ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న  అల్పపీడన ప్రాంతం ఉత్తర దిశగా కదులుతూ  వాయువ్య మరియు పరిసర మధ్య బంగాళాఖాతంలో ప్రస్పుటమైన అల్పపీడన ప్రాంతంగా ఏర్పడింది. దీని అనుబంధ ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపు వంగి వున్నది.  ఇది ఉత్తర దిశగా కదులుతూ బలపడి  ఉత్తర ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ తీరంలోని వాయువ్య బంగాళాఖాతం వద్ద ఈనెల 8న వాయుగుండంగా మారే అవకాశం వుంది.

తరువాత ఇది పశ్చిమ - వాయువ్య దిశగా కదులుతూ వచ్చే 3 రోజులలో గంగేటిక్ పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్ మరియు పరిసర ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా కొనసాగే అవకాశం వున్నది. ఋతుపవన ద్రోణి ఈరోజు సగటు సముద్ర మట్టానికి బికానర్, కోట,  పెండ్రా రోడ్, పరదీప్, వాయువ్య మరియు పరిసర మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన  ప్రస్పుటమైన అల్పపీడన ప్రాంతం యొక్క కేంద్రం గుండా  కొనసాగుతున్నది.

ALSO READ | చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్​లో పిడుగుపాటుకు మరో ఇద్దరు జవాన్లు మృతి

తెలంగాణలో ఆదివారం ( సెప్టెంబర్ 8) ​ పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. సెప్టెంబర్ 9 నుంచి మూడు రోజుల పాటు  మళ్లీ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 9వ తేదీన ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. సెప్టెంబర్ 10వ తేదీన కూడా పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.