నల్లగొండ జిల్లాలో బోల్తా పడిన ఆరెంజ్ ట్రావెల్ బస్సు

నల్లగొండ జిల్లా : చిట్యాల మండలం వట్టిమర్తి వద్ద ఆరెంజ్ ట్రావెల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 9 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి సీరియస్​గా ఉన్నట్లు తెలుస్తోంది.

క్షతగాత్రులను నార్కట్ పల్లి కామినేని హాస్పిటల్ కి తరలించారు. విజయవాడ,హైదరాబాద్ 65 జాతీయ రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. విషయం తెలియగానే ఘటనా స్థలానికి పోలీసులు వెళ్లారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.