
హైదరాబాద్ లో శివారులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం ( మార్చి 26 ) తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి... చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం హైవేపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు.. ఈ క్రమంలో వెనక నుంచి వచ్చిన మరో ట్రావెల్స్ బస్సు ఆరెంజ్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ సహా 13మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో హైవేపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.