- విచారణ అధికారిగా ములుగు ఆర్డీవో
ఏటూరునాగారం, వెలుగు : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చెల్పాక అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ జరపాలని కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఎంక్వైరీ ఆఫీసర్‌గా ములుగు ఆర్డీవోను నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఏటూరునాగారం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని చెల్పాక అడవుల్లో ఈ నెల 1న జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు. ఏటూరునాగారం డీఎస్పీ రిఫరెన్స్‌తో ఎన్‌కౌంటర్‌పై విచారణకు ఆదేశించారు.
నెల రోజుల్లో పూర్తి స్థాయి విచారణ జరిపి రిపోర్ట్‌నుఅందజేయాలని ఎంక్వైరీ ఆఫీసర్‌కు సూచించారు. ఇదిలా ఉండగా.. ఎన్‌కౌంటర్‌పై పౌరహక్కుల సంఘాల నేతలు, మావోయిస్టు మృతుల కుటుంబసభ్యులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కలెక్టర్ ఎంక్వైరీ ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది.