ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో మేడారం ప్రసాదం.. బుక్​ చేస్తే  డోర్ డెలివరీ  

ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో మేడారం ప్రసాదం.. బుక్​ చేస్తే  డోర్ డెలివరీ  

హైదరాబాద్, వెలుగు:ఆన్‌‌‌‌లైన్​లో ఆర్డర్‌‌‌‌‌‌‌‌ చేస్తే మేడారం సమ్మక్క, సారక్క ప్రసాదం(బెల్లం) ఇంటి వద్దకే డెలివరీ చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌‌‌‌రెడ్డి తెలిపారు. ఈ నెల 12 నుంచి 22వ తేదీ వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రసాదం కావాలనుకునేవారు మీసేవ లేదా టీ యాప్‌‌‌‌లో ఆర్డర్ చేసుకోవాలన్నారు. రూ.225 చెల్లిస్తే రెండొందల గ్రాముల బెల్లం, పసుపు, కుంకుమ, అమ్మవారి ఫొటో  భక్తులకు  ఇంటి వద్ద అందజేస్తామన్నారు. ఆర్టీసీ డిపోలు, బస్టాండ్లలోనూ ప్రసాదం బుక్ చేసుకోవచ్చన్నారు.

ఇంటి నుంచే మొక్కులు చెల్లించుకోవచ్చు..
వివిధ కారణాలతో మేడారం వెళ్లలేని భక్తుల కోసం ప్రత్యేకంగా పార్సిల్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చిన్నట్లు ఆర్టీసీ తెలిపింది. భక్తులు తాము చెల్లించాలనుకునే బంగారాన్ని పార్సిల్‌‌‌‌లో బుక్ చేస్తే,  సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లకు సమర్పించనున్నట్లు వెల్లడించింది. పార్సిల్‌‌‌‌లో 5 కేజీల వరకు బంగారాన్ని పంపించుకోవచ్చని తెలిపింది. సంబంధిత భక్తులకు 200 గ్రాముల ప్రసాదం, అమ్మ వారి ఫొటో, పసుపు,కుంకుమ అందజేస్తామని చెప్పింది. బుకింగ్​ పాయింట్​ నుంచి 200 కిలోమీటర్ల వరకు రూ.400, అంతకంటే ఎక్కువ ఉంటే రూ.450 చార్జీలు వసూలు చేస్తామంది.ఈ సేవలు ఈ నెల11 నుంచి 17 వరకు అందిస్తామని తెలిపింది. ఇతర వివరాలకు ఆర్టీసీ కాల్ సెంటర్ నెంబర్లు 040–30102829, 040–68153333, లేదా www.tsrtc.telangana.gov.in వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో సంప్రదించాలని ఆర్టీసీ సూచించింది.