చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఏర్పాటైన చేవెళ్ల, మొయినాబాద్ మున్సిపాలిటీల్లో కొత్త పోస్టులకు ఉత్తర్వులు వెలువడ్డాయి. చేవెళ్ల మున్సిపల్ పరిధిలో చేవెళ్ల, కేసారం, మల్కాపూర్, దామరగిద్ద, దేవుని ఎర్రవల్లి, ఊరెళ్ల, రామన్నగూడ, ఇబ్రహీంపల్లి గ్రామ పంచాయతీలు విలీనం కాగా.., అజీజ్‌నగర్, హిమాయత్‌నగర్, చిలుకూరు, ఎన్కేపల్లి, మొయినాబాద్, సురంగల్, ముర్తుజాగూడ, పెద్దమంగళారం గ్రామాలను కలిపి ప్రభుత్వం మొయినాబాద్మున్సిపాలిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఈ పంచాయతీల్లో ఇప్పటివరకు సెక్రటరీలుగా పనిచేసిన వారికి ప్రభుత్వం మున్సిపాలిటీల్లో కొత్త పోస్టులు కేటాయించింది. జీపీ కార్యదర్శుల్లో గ్రేడ్-1 నుంచి గేడ్ -4 అధికారులు ఉండగా, వారి కేటగిరిని బట్టి పోస్టులు సర్దుబాటు చేశారు. మొయినాబాద్‌కు సంబంధించి మేనేజర్‌గా జమీల్‌అహ్మద్, రెవెన్యూ సెక్షన్సంధ్యారాణి, మెప్మా వెంకటయ్య, టౌన్ఫ్లానింగ్ఆఫీసర్గా సుదర్శన్, శానిటేషన్సెక్షన్ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్టాబ్లిష్మెంట్సెక్షన్ వెంకటేశ్, ఇంజినీరింగ్సెక్షన్ రామకృష్ఱారెడ్డి, అకౌంట్సెక్షన్ శ్రీనివాస్‌కు అప్పగించారు. అయితే, చేవెళ్ల మున్పిపాలిటీ పరిధిలో ఉన్న 8 గ్రామ పంచాయతీల సెక్రటరీలు గ్రేడ్–1, గ్రేడ్–2 వాళ్లు , చేవెళ్ల పంచాయతీ సెక్రటరీ ఒక్కరే గ్రేడ్ –3 ఉండడంతో ఇంకా సర్టుబాటు చేస్తున్నారు.