
భవన నిర్మాణ అనుమతుల నిబంధనలు సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి మున్సిపాలిటీస్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ జీవో జారీ చేశారు. నేషనల్ బిల్డింగ్ కోడ్-2016కు అనుగుణంగా సవరణలు చేశారు. బిల్డర్స్, డెవలపర్స్ సంఘం విజ్ఞప్తితో నిబంధనల్లో సవరణలు చేసినట్లు అరవింద్‌కుమార్ తెలిపారు. గ్రీన్ హోమ్స్ నిబంధనల ప్రకారం గదుల వెంటిలేషన్‌కు అనుమతి, నిబంధనల మేరకు టెర్రస్‌పై స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి అనుమతి ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీకి ముందే బిటి, సిసి రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. రోడ్ల నిర్మాణం పూర్తైన తర్వాతే ఓసి జారీ చేయాలని చెప్పారు. విస్తరణ ముందు..తర్వాత బిల్డింగ్ ఏరియా అనుమతించిన ప్రకారం ఉండాలని సూచించారు.