మరికల్, వెలుగు: ఆత్మకూరు నుంచి మరికల్‌కు వస్తున్న గద్వాల డిపోకు చెందిన ఆర్డినరీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. 30 మంది ప్యాసింజర్లతో వస్తున్న బస్సు జిన్నారం గ్రామం స్టేజీ దాటిన తర్వాత రోడ్డు మలుపు వద్ద గుంతలు ఉండడంతో వాటిని తప్పించబోయి రోడ్డు పక్కకు దూసుకెళ్లి చెట్టును ఢీ కొని ఆగింది.
డ్రైవర్‌తో పాటు ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. 3 జేసీబీలతో బస్సును గుంతలో నుంచి బయటకు తీశారు.