ఆ రాష్ట్రంలో మొత్తం సేంద్రీయ వ్యవసాయమే

ఆ రాష్ట్రంలో మొత్తం సేంద్రీయ వ్యవసాయమే

మెరిసేదంతా బంగారం కాదు. తినే తిండి అంతా ఆరోగ్యాన్ని అందించలేదు.  ఎరువులతో పండించిన కూరలు.. ఏపుగా పెరిగి కలర్‌‌‌‌ఫుల్‌‌‌‌గా కనిపించొచ్చు.  కానీ రోగాల్ని మాత్రం కచ్చితంగా తెచ్చి పెడతాయి. రసాయనాలు సోకని కూరగాయలు ముడతలతో కంటికి ఇంపుగా అనిపించకపోవచ్చు.  కానీ రుచి, పోషకాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి.  అందుకే ఆర్గానిక్‌‌‌‌ ఫార్మింగ్‌‌‌‌కి ఎవర్‌‌‌‌గ్రీన్‌‌‌‌ డిమాండ్‌‌‌‌ ఉంటోంది. 

ఆర్గానిక్‌‌‌‌ రాష్ట్రం సిక్కిం‌‌‌‌

ఒక రాష్ట్రం మొత్తం సేంద్రియ సాగుతో ముందుకెళ్తుందని ఎవరైనా ఊహించగలరా?.  కానీ, ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన సిక్కిం ఈ ఘనత సాధించింది. ఇక్కడ  ఏవి సేంద్రియ ఉత్పత్తులో అనే అనుమానమే అక్కర్లేదు.  ప్రతీ ప్రొడక్ట్‌‌‌‌ సేంద్రియమే. పదిహేడేళ్ల క్రితమే సేంద్రియ వ్యవసాయంతో అక్కడి పంట భూముల్ని.. ఆరోగ్యమైన సిరుల భూములుగా మార్చుకుంది. 2016 నాటికి దేశంలోనే తొలి ఆర్గానిక్‌‌‌‌ స్టేట్‌‌‌‌గా గుర్తింపు దక్కించుకుంది. ఈమధ్యే  కర్ణాటక కూడా సిక్కింని ఆదర్శంగా తీసుకుని.. రాష్ట్రంలో రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేసేలా ప్రోత్సాహం అందించబోతోంది.

మన సేంద్రియ పల్లె

ఎనబావి..  జనగామ జిల్లాలో ఉండే ఒక చిన్నపల్లె. 60 దాకా కుటుంబాలుండే ఈ పల్లెలో.. మొత్తం సేంద్రియ వ్యవసాయమే కనిపిస్తుంది. పద్నాలుగేళ్ల క్రితమే ఆదర్శ రైతు పొన్నం మల్లయ్య ‘జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌‌‌‌’తో మరికొందరికి స్ఫూర్తిగా నిలిచాడు.  ఆయన చూపించిన బాటలోనే పయనించి.. ఆ ఊరు మొత్తం రసాయనాలకు దూరంగా ఆర్గానిక్‌‌‌‌ ఫార్మింగ్‌‌‌‌ చేసింది. 2006లోనే ఎనబావి ‘ఆర్గానిక్‌‌‌‌ విలేజ్‌‌‌‌’గా గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత రీసెర్చర్లు, ఫారినర్లు సైతం ఈ ఊరికి వచ్చారు. ఆ తర్వాతి కాలంలో అఫీషియల్‌‌‌‌గా తెలంగాణ ‘ఫస్ట్‌‌‌‌ ఆర్గానిక్‌‌‌‌ విలేజ్‌‌‌‌’ ట్యాగ్‌‌‌‌ ఈ ఊరికి దక్కింది.

బిగ్‌‌‌‌ క్యాబేజీ

ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్న క్యాబేజీ పక్కా ఆర్గానిక్‌‌‌‌ పంట.  బరువు 7.6 కేజీలు. మణిపూర్‌‌‌‌లోని సేనాపతి జిల్లా లియాయి చిలావో గ్రామంలో ఈ భారీ క్యాబేజీని పండించారు. రీసెంట్‌‌‌‌గా నాగా హిల్స్‌‌‌‌ ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌ పేజీలో ఈ ఫొటోని పోస్ట్ చేయగా.. వైరల్ అయ్యింది.  అయితే ప్రపంచంలో అతిపెద్ద క్యాబేజీ మాత్రం 2012లో అలస్కాకి చెందిన ఒక రైతు పండించాడు. దాని బరువు 62 కేజీలు.

ఆర్గానిక్‌‌‌‌ప్లేస్‌‌‌‌లివే!

ఆర్గానిక్‌‌‌‌ ఫార్మింగ్‌‌‌‌ అంటార్కిటికాలో తప్ప దాదాపు అన్ని దేశాల్లో ఉంది. యూరప్ కంట్రీస్‌‌‌‌లో ప్రతీ ఏడాది ఎక్కువ సాగు అవుతోంది. ఉత్తర ఐరోపాలోని ఈస్టోనియా అనే చిన్నదేశం.. ఫస్ట్‌‌‌‌ ఆర్గానిక్‌‌‌‌ కంట్రీగా గుర్తింపు దక్కించుకుంది!.  ఆర్గానిక్ ప్రొడక్ట్స్‌‌‌‌ మార్కెట్ విషయానికొస్తే.. నార్త్‌‌‌‌ అమెరికా, యూరప్‌‌‌‌ దేశాలు చాలా బలంగా ఉన్నాయి. ఆస్ట్రేలియాలో  ఎక్కువ భూభాగంలో సేంద్రియ సాగు నడుస్తోంది. అయితే ఉన్నభూమిలోనే ఎక్కువ భూభాగం ఆర్గానిక్‌‌‌‌ ఫార్మింగ్‌‌‌‌కి కేటాయించింది మాత్రం యూకేలోని ఫలక్‌‌‌‌లాండ్‌‌‌‌ ఐలాండ్స్‌‌‌‌. ఇక ప్రపంచంలో ఎక్కువమంది ఆర్గానిక్‌‌‌‌ ఫార్మింగ్‌‌‌‌ చేసేది మాత్రం మనదేశంలోనే.  ఆసియా దేశాల్లో చైనా ఆర్గానిక్‌‌‌‌ ఫార్మింగ్‌‌‌‌లో మొదటి ప్లేస్‌‌‌‌లో ఉండగా, మన దేశం రెండో ప్లేస్‌‌‌‌లో ఉంది.  ఆర్గానిక్‌‌‌‌ సాగు విషయంలో జర్మనీ మాత్రం ప్రత్యేకం. ఇక్కడ ఆర్గానిక్‌‌‌‌ ఫార్మింగ్ కోసం సొంతంగా రెగ్యులేషన్స్‌‌‌‌ రూపొందించుకున్నారు.