- ముంబై: పండుగలు, పెళ్లిళ్ల సీజన్, ఫాస్ట్ ఫ్యాషన్‌కు ప్రాధాన్యత పెరగడం వల్ల వ్యవస్థీకృత రిటైల్ దుస్తుల రంగం 2025 ఆర్థిక సంవత్సరంలో 8–-10 శాతం ఆదాయ వృద్ధి సాధిస్తుందని మంగళవారం ఒక నివేదిక పేర్కొంది. సాధారణ రుతుపవనాలు, ద్రవ్యోల్బణం తగ్గడం, పండుగలు, పెళ్లిళ్ల సీజన్, ఫాస్ట్ ఫ్యాషన్ ఈ రంగానికి కలసి వస్తోందని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. దీని రిపోర్ట్ ప్రకారం... మాస్ మార్కెట్ సెగ్మెంట్ మొత్తం అమ్మకాలలో 60 శాతం వాటాను కలిగి ఉంది.
కరోనాకు ముందు ఇది 56 శాతం ఉండేది. ఫాస్ట్ ఫ్యాషన్‌కు పెరుగుతున్న ప్రజాదరణ కారణంగా దీని నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో భారీగా ఆదాయం వస్తుంది. డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే 2018–2023 ఆర్థిక సంవత్సరాల మధ్య కనిపించే 11-–12 శాతం సమ్మేళనం వార్షిక వృద్ధి రేటు కంటే ఈసారి ఆదాయ వృద్ధి నెమ్మదిగా ఉంటుందని క్రిసిల్తెలిపింది.