
పెండ్లిళ్లు, ఈవెంట్లకు వెళ్లినప్పుడు మేకప్ కిట్ కచ్చితంగా తీసుకెళ్తుంటారు. కానీ.. లోషన్లు, పౌడర్లు లాంటి వాటిని బ్యాగ్‌లో వేయడం వల్ల లీకేజీలు జరుగుతుంటాయి. అలాంటి సమస్యలు రాకూడదంటే ఈ కాస్మొటిక్స్ ఆర్గనైజర్‌ని వాడాలి. దీన్ని ఓషియనెవో అనే కంపెనీ తీసుకొచ్చింది. ఇందులో అన్ని రకాల మేకప్ వస్తువులను చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇందులో రెండు అరలు ఉంటాయి. వాటిలో మేకప్ స్పాంజ్లాంటివి పెట్టుకోవచ్చు.
పై భాగంలో బాటిళ్లను సర్దుకోవచ్చు. దీన్ని హై క్వాలిటీ ఏబీఎస్ ప్లాస్టిక్‌తో తయారుచేశారు. పైగా ఇది స్క్రాచ్ రెసిస్టెంట్‌తో వస్తుంది. ఇందులో లిప్‌స్టిక్‌లు, మేకప్ బ్రష్‌లు, ఐబ్రో పెన్సిల్స్, ఫౌండేషన్ స్టిక్‌లు, బ్యూటీ టూల్స్, నెక్లెస్‌లు కూడా స్టోర్ చేసుకోవచ్చు.