కార్పొరేట్ హాస్పిటళ్లలో ఆర్గాన్స్ దందా

కార్పొరేట్ హాస్పిటళ్లలో ఆర్గాన్స్ దందా
  •  జీవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లొసుగులే ఆధారంగా అక్రమాలు  
  • బ్రెయిన్ డెత్ కేసులను అనౌన్స్ చేస్తూ కోట్లల్లో సంపాదన
  • అవయవాలు దొరక్క ప్రాణాలు కోల్పోతున్న సామాన్యులు  
  • బ్రెయిన్ డెత్ పేషెంట్ హార్ట్, లివర్, కిడ్నీలు తీసుకునే వెసులుబాటు
  • అవి తమ దగ్గరున్న పేషెంట్లకు అమర్చుకునేందుకు ఆస్పత్రులకు అనుమతి ​ 
  • ట్రాన్స్ ప్లాంటేషన్​కు పేషెంట్ల నుంచి భారీ మొత్తంలో వసూలు 
  • బ్రెయిన్ డెత్ కేసులను రిఫర్ చేసేందుకు జిల్లాల్లోని హాస్పిటళ్లతో ఒప్పందాలు 
  • డాక్టర్లు మొదలుకొని అంబులెన్స్ డ్రైవర్ల వరకూ వాటాలు 
  • దేశంలోనే అత్యధిక బ్రెయిన్ డెత్స్ డిక్లేర్ చేసిన హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్ 
  • ఇటీవల బ్రెయిన్ డెత్ అయిన వ్యక్తి కుటుంబానికి రూ.3 లక్షలు ఇచ్చిన మరో ఆస్పత్రి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొన్ని కార్పొరేట్ హాస్పిటళ్లు అవయవాల దందా చేస్తున్నాయి. జీవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిబంధనల్లో లొసుగులే ఆధారంగా అక్రమాలకు పాల్పడుతున్నాయి. బ్రెయిన్ డెత్ కేసులతో కోట్లు దండుకుంటున్నాయి. ఆ కేసులను రిఫర్ చేసేందుకు డాక్టర్లు, అంబులెన్స్ డ్రైవర్లకు ముడుపులు ఇస్తున్నాయి. జీవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దాన్ నిబంధనల ప్రకారం.. పేషెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బ్రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయితే, అవయవాలు తీసుకునే అధికారం ఆ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే ఉంటుంది. డోనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి సేకరించిన హార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లివర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఒక కిడ్నీని.. తమ దగ్గర ఆర్గాన్స్​ కోసం రిజిస్టర్ చేసుకున్న పేషెంట్ల కోసం వినియోగించుకునేందుకు ఆ హాస్పిటల్​కు అనుమతి ఉంది.

Also Read:-మెట్రో డీలక్స్​ మంత్లీ బస్ పాస్ రూ. 1,450

మరో కిడ్నీని ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖాన్లకు సంబంధించిన ఉమ్మడి జాబితా (జనరల్ పూల్)లో అవయవం కోసం ఎదురుచూస్తున్న పేషెంట్‌‌‌‌కు అమర్చాల్సి ఉంటుంది. ఒకవేళ పేషెంట్ బ్రెయిన్ డెత్ అయిన హాస్పిటల్‌‌‌‌లో ఆర్గాన్ ట్రాన్స్‌‌‌‌ప్లాంటేషన్ సర్జరీలు చేసే సౌకర్యం లేకపోతే, జనరల్ పూల్‌‌‌‌లో ఉన్న పేషెంట్లకు ఆ అవయవాలను అమర్చాల్సి ఉంటుంది. ఆర్గాన్ ట్రాన్స్‌‌‌‌ప్లాంటేషన్ సౌకర్యం ఉండి, ఆ హాస్పిటల్‌‌‌‌లో రిజిస్టర్ చేసుకున్న పేషెంట్లలో ఎవరికీ ఆర్గాన్ సూట్ అవ్వకపోతే కూడా జనరల్‌‌‌‌ పూల్‌‌‌‌లో ఉన్న పేషెంట్లకు ఆ ఆర్గాన్స్‌‌‌‌ను ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రెండు నిబంధనలను కొన్ని కార్పొరేట్ హాస్పిటళ్లు తమకు అనుకూలంగా మల్చుకుని దందా చేస్తున్నాయి. 

చావులోనూ రిఫరల్‌‌‌‌ దందా

యాక్సిడెంట్లలో గాయపడి బ్రెయిన్ డెత్ అయ్యే పరిస్థితి ఉన్న పేషెంట్లను, బ్రెయిన్ డెత్ అయిన పేషెంట్లను తమ హాస్పిటల్‌‌‌‌కు రిఫర్‌‌‌‌‌‌‌‌ చేసేలా.. జిల్లాల్లోని చిన్న, పెద్ద హాస్పిటళ్లతో పాటు అంబులెన్స్ డ్రైవర్లతో కార్పొరేట్ ఆస్పత్రులు ఒప్పందం చేసుకుంటున్నాయి. పేషెంట్‌‌‌‌ను రిఫర్ చేసినందుకు వారికి పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెప్పుతున్నాయి. కార్పొరేట్ దవాఖానకు వెళ్లేందుకు పేషెంట్ కుటుంబసభ్యులు ఒప్పుకోకపోతే.. ఆరోగ్యశ్రీ కింద ట్రీట్ మెంట్ చేయిస్తామని, ఫీజు తగ్గిస్తామని రకరకాల కారణాలు చెప్పి వారిని ఒప్పిస్తున్నారు.

ఎలాగోలా పేషెంట్‌‌‌‌ను హైదరాబాద్‌‌‌‌లోని కార్పొరేట్ హాస్పిటల్‌‌‌‌కు షిఫ్ట్ చేసి.. కొన్ని గంటల తర్వాతనో, మరుసటి రోజో బ్రెయిన్ డెత్ అనౌన్స్ చేస్తున్నారు. తద్వారా సంపాదించిన అవయవాలను తమ వద్ద ఆర్గాన్ కోసం రిజిస్టర్ చేసుకున్న పేషెంట్లకు అమర్చుతున్నారు. వీరి వద్ద అనధికారికంగా భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ వ్యవహారం జీవన్‌‌‌‌దాన్‌‌‌‌ అధికారులకు తెలిసే జరుగుతున్నదని, కానీ వాళ్లు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి.

దందా జరుగుతున్నది ఇట్ల..  

ఇటీవల మంచిర్యాల జిల్లాలో ఓ వ్యక్తికి యాక్సిడెంట్ జరిగి తలకు దెబ్బ తగిలింది. ఆ పేషెంట్‌‌‌‌ను మంచిర్యాలలోని ఓ హాస్పిటల్ డాక్టర్లు కరీంనగర్‌‌‌‌‌‌‌‌లోని భద్రకాళి హాస్పిటల్‌‌‌‌కు రిఫర్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఓ అంబులెన్స్‌‌‌‌ ఇచ్చి పేషెంట్‌‌‌‌ను పంపించారు. ఒక్క అంబులెన్స్ వెంబడి ఏకంగా ఐదుగురు అంబులెన్స్ డ్రైవర్లు వెళ్లారు. మార్గమధ్యలోనే కుటుంబ సభ్యులను మభ్యపెట్టి భద్రకాళికి బదులు.. కెల్విన్ హాస్పిటల్‌‌‌‌కు పేషెంట్‌‌‌‌ను తీసుకెళ్లారు. కెల్విన్‌‌‌‌లో అసలు న్యూరో డాక్టర్లే లేకపోవడం గమనార్హం. కెల్విన్‌‌‌‌లో ఉన్న ఇతర స్పెషలిస్ట్ డాక్టర్లు.. పేషెంట్‌‌‌‌ను యశోద హాస్పిటల్‌‌‌‌కు రిఫర్ చేశారు.

అంబులెన్స్‌‌‌‌లో పేషెంట్‌‌‌‌ను యశోదకు తీసుకొస్తుండగానే.. అతని అవయవాలను డొనేట్ చేయాలంటూ అంబులెన్స్ డ్రైవర్లు కుటుంబసభ్యులను ఒప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆర్గాన్స్ డొనేట్ చేస్తే డబ్బులు కూడా వస్తాయంటూ మభ్యపెట్టారు. అంబులెన్స్ డ్రైవర్లలో నుంచి ఓ వ్యక్తి యశోదకు పేషెంట్‌‌‌‌ను తరలిస్తున్నట్టు కామినేని హాస్పిటల్‌‌‌‌కు సమాచారం అందించాడు. కామినేని హాస్పిటల్ పీఆర్వో యాదగిరి బాధితుడి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి.. పేషెంట్‌‌‌‌ను కామినేని హాస్పిటల్‌‌‌‌కు తరలించేలా వారిని ఒప్పించాడు.

చివరకు కామినేని హాస్పిటల్‌‌‌‌లో పేషెంట్‌‌‌‌ను బ్రెయిన్ డెత్‌‌‌‌గా డిక్లేర్ చేసి, అవయవాల డొనేషన్‌‌‌‌కు కుటుంబ సభ్యులను ఒప్పించారు. ఇందుకు రూ.3 లక్షలు తమకు చెల్లించినట్టుగా మృతుడి భార్య తెలిపింది. మంచిర్యాల నుంచి ఒక్క అంబులెన్స్‌‌‌‌లో ఐదుగురు డ్రైవర్లు ఎందుకొచ్చారు? పేషెంట్‌‌‌‌ బ్రెయిన్ డెత్ అయినట్టు మంచిర్యాల డాక్టర్లు గుర్తించారా? లేదా కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో కెల్విన్ హాస్పిటల్ డాక్టర్లు గుర్తించారా? ఒకవేళ బ్రెయిన్ డెత్ అయినట్టు గుర్తించకపోతే, అంబులెన్స్‌‌‌‌లోనే పేషెంట్ కుటుంబసభ్యులతో అవయవాల గురించి డ్రైవర్లు బేరం ఎందుకు పెట్టారు? ఒకవేళ బ్రెయిన్ డెత్ అయినట్టు కరీంనగర్‌‌‌‌‌‌‌‌లోనే గుర్తిస్తే, పేషెంట్‌‌‌‌ను హైదరాబాద్‌‌‌‌లోని యశోద హాస్పిటల్‌‌‌‌కు ఎందుకు రిఫర్ చేశారు? యశోద హాస్పిటల్‌‌‌‌కు తీసుకొస్తుండగా పేషెంట్‌‌‌‌ను కామినేనికి ఎందుకు తరలించారు? అసలు రూ.3 లక్షలు చెల్లించాల్సిన అవసరం కామినేనికి ఏంటి? ఇలా చెల్లించడం నిబంధనలకు విరుద్ధమైనా, కామినేనిపై జీవన్‌‌‌‌దాన్ సంస్థ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? వంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

అంబులెన్స్ డ్రైవర్ల మధ్య గొడవలతో ఈ కేసు బయటకొచ్చింది. కానీ, నిత్యం ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఈ కేసును కూడా అవయవాల రాకెట్‌‌‌‌ కోణంలో విచారించకుండా, కేవలం అంబులెన్స్ డ్రైవర్ల రిఫరల్ దందాగా చూపించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో ఎక్కడ బ్రెయిన్ డెత్ అయినా, బ్రెయిన్ డెత్ అయ్యే అవకాశం ఉన్నా.. ఆ పేషెంట్లను హైదరాబాద్‌‌‌‌లోని కార్పొరేట్ హాస్పిటళ్లకు రిఫర్ చేస్తున్నారు. ఇందుకుగానూ లక్షల్లో కమీషన్లు పొందుతున్నారు. ఇక్కడ హాస్పిటళ్లలో బ్రెయిన్ డెత్స్ డిక్లేర్ చేసి, అవయవాలను రోగులకు అమర్చడం ద్వారా ఆయా హాస్పిటళ్లు కోట్లు కొల్లగొడుతున్నాయి. మానవ అవయవాలతో ఇలా వ్యాపారం చేయడం పెద్ద నేరమైనప్పటికీ, సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. 

పైసలున్నోళ్లకే అవయవాలు..

బ్రెయిన్ డెత్ అయిన పేషెంట్ల ఆర్గాన్స్‌‌‌‌ను అవసరమైన పేషెంట్లకు అమర్చేందుకు జీవన్‌‌‌‌దాన్ వ్యవస్థ పని చేస్తున్నది. ఆర్గాన్స్ అవసరమైన పేషెంట్లు జీవన్‌‌‌‌దాన్‌‌‌‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. పేషెంట్‌‌‌‌ కండీషన్, వయసును బట్టి డాక్టర్లు ఆ పేషెంట్‌‌‌‌కు కొన్ని మార్కులు కేటాయించి.. లిస్ట్‌‌‌‌లో అతని పేరు ఎక్కిస్తారు. స్టేట్ లెవల్ లిస్ట్‌‌‌‌తో (జనరల్ పూల్‌‌‌‌) పాటు ప్రైవేటు హాస్పిటళ్లు సెపరేటుగా లిస్ట్ మెయింటెయిన్ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

దీంతో డబ్బులు దండిగా ఉన్న పేషెంట్లు బడా కార్పొరేట్ హాస్పిటళ్లలో తమ పేర్లను అవయవాల కోసం రిజిస్టర్ చేసుకుంటున్నారు. జనరల్ లిస్టులో ఉన్నవాళ్ల కంటే, ఇలా హాస్పిటల్‌‌‌‌ లిస్టులో ఉన్న పేషెంట్లకే చాలా తొందరగా అవయవాలు దొరుకుతున్నాయి. బ్రెయిన్ డెత్ డిక్లరేషన్‌‌‌‌లో జరుగుతున్న అవకతవకలే ఇందుకు కారణం. అవయవాల కోసం అక్రమాలకు పాల్పడుతున్న కార్పొరేట్ దవాఖాన్లు.. అందుకు అవుతున్న ఖర్చు మొత్తాన్ని పేషెంట్ల నుంచే వసూలు చేస్తున్నాయి.

ప్రాణానికి సంబంధించిన విషయం కావడంతో ఎంత ఖర్చుకైనా జనాలు వెనుకాడడం లేదు. అంతేకాదు మన స్టేట్‌‌‌‌లో ఉన్న వెసులుబాటుతో వేర్వేరు రాష్ట్రాల నుంచి కూడా డబ్బులున్న వ్యక్తులు వచ్చి ఇక్కడి కార్పొరేట్ దవాఖాన్లలో లిస్ట్ అవుతున్నారు. దీంతో అవసరం ఉన్నవారికంటే, పైసలు ఉన్నవారికే తొందరగా ఆర్గాన్స్ దొరుకుతున్నాయి. డబ్బులు పెట్టుకోలేని సామాన్య పేషెంట్లు ఆర్గాన్స్ కోసం ఎదురు చూస్తూనే ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో చిన్న పిల్లలు, యువత కూడా ఉంటున్నారు. 

బ్రెయిన్ డెత్స్ కేసులన్నీ కార్పొరేట్ హాస్పిటళ్లలోనే నమోదు.. 

మన రాష్ట్రంలో ఇప్పటివరకు అయిన బ్రెయిన్ డెత్ కేసుల్లో కనీసం 3 శాతం కూడా ప్రభుత్వ దవాఖాన్లలో నమోదు కాలేదు. జీవన్‌‌‌‌దాన్ ప్రారంభ మైనప్పటి నుంచి ఇప్పటివరకు 1,466 బ్రెయిన్ డెత్ కేసుల్లో అవయవాలను దానం చేసేందుకు కుటుంబసభ్యులు ఒప్పుకున్నారు. ఇందులో 97 శాతం కార్పొరేట్ దవాఖాన్లలోనే జరగడం, ఈ బ్రెయిన్ డెత్స్ అన్నీ హైదరాబాద్‌‌‌‌లోని కార్పొరేట్ హాస్పిటళ్లలోనే నమోదవడం గమనార్హం.

బ్రెయిన్ డెత్ కేసుల డిక్లరేషన్‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌కు చెందిన ఓ ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్ జాతీయ స్థాయిలో రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు అత్యధిక బ్రెయిన్ డెత్స్‌‌‌‌ డిక్లేర్ చేసిన హాస్పిటల్‌‌‌‌గా ఘనత వహించింది. ఇందుకుగానూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ హాస్పిటల్ యాజమాన్యం అవార్డు కూడా అందుకుంది. బ్రెయిన్ డెత్ డిక్లరేషన్‌‌‌‌లో బెస్ట్ టీమ్ ఆఫ్ డాక్టర్లు ఉన్న హాస్పిటల్‌‌‌‌గా నగరంలోని మరో ప్రముఖ హాస్పిటల్ కూడా అవార్డు అందుకుంది. ఈ హాస్పిటల్‌‌‌‌ స్టాక్ మార్కెట్‌‌‌‌లోనూ లిస్ట్ అయింది.

పదేండ్లలో 1,466  బ్రెయిన్ డెత్స్ 

2013 నుంచి 2024 వరకు రాష్ట్రంలో 1,466 బ్రెయిన్ డెత్స్ డిక్లేర్ చేశారు. ఇందులో ప్రభుత్వ దవాఖాన్లలో 42 బ్రెయిన్ డెత్స్ డిక్లేర్ చేయగా, ప్రైవేట్ దవాఖాన్లలో 1,424 బ్రెయిన్ డెత్స్ డిక్లేర్ చేశారు. అత్యధికంగా యశోద హాస్పిటల్ 500 బ్రెయిన్ డెత్స్‌‌ను డిక్లేర్ చేసింది. ఇందులో 287 బ్రెయిన్ డెత్స్‌‌ను గడిచిన మూడున్న రేండ్లలోనే డిక్లేర్ చేయడం గమనార్హం.

అత్యధిక బ్రెయిన్ డెత్స్ డిక్లేర్ చేసిన  ఆస్పత్రులివీ (2013–2024):


హాస్పిటల్    బ్రెయిన్ డెత్స్ 
 

యశోద               500
కిమ్స్‌‌                  298
అపోలో              194
గ్లోబల్                 165
కామినేని              95
కేర్                       57
నిమ్స్‌‌                  32
కాంటినెంటల్     23
సన్‌‌షైన్              21
మెడికవర్           14
మెడిసిటీ               9
ఉస్మానియా          9
ఏఐజీ                    8 
గాంధీ                    1