హైదరాబాద్: అతడు పంటలు పండించి నలుగురికి అన్నం పెట్టే అన్నదాత మాత్రమే కాదు.. అవదానం చేసి ప్రాణదాత అయ్యాడు. ప్రమాదంలో గాయపడ్డాడు. నాలుగు రోజుల పాటు ఐసీయూ చికిత్స అందించినా.. లక్షలు ఖర్చు పెట్టి చికిత్స చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆ అన్నదాతను కాపాడలేం అని చేతులె త్తేశారు. బ్రెయిన్ డెడ్ అని ప్రకటించారు. అయితే అన్నదాత కుటుంబం మాత్రం కుటుంబ పెద్ద అవయవాలు దానం చేయాలని నిర్ణయించుకున్నారు. అవయవ దానంతో ఐదుగురి ప్రాణాలు కాపాడారు. వివరాల్లోకి వెళితే..
అక్టోబరు 28న ఇంటి వద్ద పడి రైతు తలకు గాయమైంది. అతన్ని సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్స్‌కు తరలించారు, అక్కడ అతను నాలుగు రోజులు అత్యవసర ICU సంరక్షణలో ఉన్నాడు మరియు అతని ఆరోగ్యంలో ఎటువంటి మెరుగుదల లేకపోవడంతో, అక్టోబర్ 31 న వైద్యులు అతన్ని బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం మన్నెవారి వంపు గ్రామానికి చెందిన రైతు మేడబోయిన పెంటయ్య (61) అనే ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్సకోసం సికింద్రాబాద్ లోని యశోధ ఆస్పత్రికి తరలించారు. నాలుగు రోజుల పాటు ఐసీయూ చికిత్స అందంచిన వైద్యులు పెంటయ్య ఆరోగ్యంలో ఎటువంటి మెరుగుదల లేకపోవడంతో అక్టోబర్ 31న బ్రెయిన్ డెడ్ గా ప్రకటించారు.
రైతు పెంటయ్య భార్య మేడబోయిన సుశీల, పిల్లలు జీవందాన్ అవయవ దానం చేయడానికి అంగీకరించారు. రెండు కిడ్నీలు, కాలేయం , రెండు కార్నియాలతో సహా మొత్తం ఐదు దాత అవయవాలు దానం చేశారు. మరో ఐదుగురి ప్రాణాలు కాపాడిన రైతు కుటుంబ సభ్యులకు జీవందాన్ అవయవ దాన వాలంటీర్లు కృతజ్ఞతలు తెలిపారు.
Also Read :- సూర్యాపేట జిల్లాలో నీటి సమస్య తీర్చినోళ్లకే ఓటేస్తాం