మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి సెగ్మెంట్ తొర్రూరులో నిర్వహించిన BRS రైతుధర్నాలో ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. ధర్నాలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతుండగా స్టేజీపైకి ఓ తొండ దూసుకొచ్చింది. భయంతో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, హరీశ్ రావు పక్కకు జరిగారు. అయితే రాజయ్య మాత్రం తొండకు భయపడుతారా అంటూ జోక్ చేశారు.
స్టేజీ మీద మాట్లాడుతుండగానే రాజయ్య దోతిపైకెక్కి...షర్ట్ లోపలికి వెళ్లింది తొండ. ఓ చేత్తో మైకు పట్టుకొని...మరో చేతితో తొండను అదిమి పట్టుకున్నారు. అక్కడున్న BRS నేతలు రాజయ్య షర్ట్ బటన్స్ విప్పి...కండువాతో తొండను పట్టుకొని బయటకు విసిరేశారు. అయితే ఇదంతా ప్రభుత్వ కుట్ర అంటూ ఫన్నీగా మాట్లాడారు రాజయ్య. దీంతో అక్కడున్న మంత్రులతో పాటు BRS శ్రేణులంతా ఒక్కసారిగా నవ్వారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.