సైబర్ నేరాలకు దూరంగా ఉండాలి: సరోజా వివేక్

సైబర్ నేరాలకు దూరంగా ఉండాలి: సరోజా వివేక్
  • స్టూడెంట్లు టెక్నాలజీని సద్వినియోగం చేసుకోండి: ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లింబాద్రి
  • కాకా బీఆర్ అంబేద్కర్ కాలేజీలో ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌కు హాజరు 

ముషీరాబాద్, వెలుగు: బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలోనే ఉన్నత చదువులు చదివారని, విద్యార్థులు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని బాగా చదువుకోవాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి సూచించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యా వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయని, ప్రతి విద్యార్థి దగ్గర సెల్ ఫోన్‌‌‌‌‌‌‌‌ ఉందని, కావాల్సిన సమాచారం అందులోనే దొరుకుతుందని చెప్పారు. దానిని దుర్వినియోగం చేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రస్తుతం స్టూడెంట్లకు కావాల్సిన సౌకర్యాలు ఉన్నా, చదువుకోలేకపోతే తప్పు ఎవరిదవుతుందని ప్రశ్నించారు. సోమవారం బాగ్ లింగంపల్లిలోని కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాలేజీలో డిగ్రీ స్టూడెంట్లకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌ జరిగింది. చీఫ్ గెస్టులుగా ప్రొఫెసర్ లింబాద్రి, కాకా అంబేద్కర్ విద్యా సంస్థల కరస్పాండెంట్ సరోజా వివేక్ హాజరయ్యారు. ఈ కాలేజీలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, అనుభవం ఉన్న ఫ్యాకల్టీ ఉందని, స్టూడెంట్లు ఈ ఫెసిలిటీస్‌‌‌‌‌‌‌‌ను వినియోగించుకోవాలన్నారు. మార్కెట్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఉద్యోగ అవకాశాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, ఆయా కోర్సులపై దృష్టి పెట్టి నేర్చుకున్నప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని చెప్పారు. కార్యక్రమంలో స్టూడెంట్లు, తల్లిదండ్రులు, విద్యా సంస్థల సిబ్బంది  పాల్గొన్నారు.

టైమ్‌‌‌‌‌‌‌‌ వేస్ట్‌‌‌‌‌‌‌‌ చేయొద్దు: సరోజా వివేక్‌‌‌‌‌‌‌‌

ప్రతి ఒక్క స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ డిగ్రీ కోర్సును మధ్యలో ఆపేయకుండా పూర్తి చేయాలని కాకా అంబేద్కర్ కాలేజీ కరస్పాండెంట్ సరోజా వివేక్ అన్నారు. చేతిలో సెల్‌‌‌‌‌‌‌‌ ఫోన్‌‌‌‌‌‌‌‌ ఉందని అనవసరమైన విషయాలను చూస్తూ, టైమ్‌‌‌‌‌‌‌‌ వేస్ట్‌‌‌‌‌‌‌‌ చేయొద్దని సూచించారు. సైబర్ క్రైమ్ నేరాలకు దూరంగా ఉండాలన్నారు. తల్లిదండ్రులకు, టీచర్లకు రెస్పెక్ట్ ఇవ్వడం విద్యార్థి దశ నుంచే అలవర్చుకోవాలని చెప్పారు. అంబేద్కర్ విద్యాసంస్థలకు 50 ఏండ్ల చరిత్ర ఉందని, కాలేజీ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ విద్యార్థులకు చదువు చెప్పడంతో పాటు ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధంగా ఉందని ఆమె తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం అంబేద్కర్ విద్యాసంస్థలు నిత్యం కృషి చేస్తూ ఉంటాయన్నారు.