ఎంపీ వెంకటేశ్​ను చేర్చుకోవడం సరికాదు: ఆరిజిన్ డెయిరీ సీఏఓ షేజల్

ఎంపీ వెంకటేశ్​ను చేర్చుకోవడం సరికాదు: ఆరిజిన్  డెయిరీ సీఏఓ షేజల్

బెల్లంపల్లి, వెలుగు: మహిళా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్  నేతను చేర్చుకోవడం సరికాదని ఆరిజిన్ డెయిరీ సీఏఓ షేజల్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను కాపాడుకుంటూ వచ్చింది వెంకటేశ్  నేత అని ఆమె ఆరోపించారు. అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం వల్ల ఆ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు.

న్యాయం కోసం తాను ఢిల్లీ వెళ్లి వెంకటేశ్ ను కలిసే ప్రయత్నం చేయగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, తిరిగి చిన్నయ్యను కాపాడేందుకు తమ మీద తప్పుడు కేసులు బనాయించి ఇబ్బంది పెట్టారన్నారు. ఒక మహిళకు న్యాయం చేయలేని ఎంపీ.. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరడం వెనుక గల ఆంతర్యం ఏమిటి అని ఆమె ప్రశ్నించారు. వెంకటేశ్  నేత లాంటి ఉసరవెల్లిలను కాంగ్రెస్  పెంచి పోషిస్తే రానున్న లోక్ సభ ఎన్నికల్లో గడపగడపకు తిరిగి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని ఆమె హెచ్చరించారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానన్నారు. కాంగ్రెస్  పార్టీ తనకు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

ALSO READ:  భారత్ రైస్ అమ్మకాలు షురూ.. కిలో రూ. 29కే